»   » లండన్ ఫ్యాన్స్ ని కలవనున్న పవన్ కళ్యాణ్, కారణమేంటో

లండన్ ఫ్యాన్స్ ని కలవనున్న పవన్ కళ్యాణ్, కారణమేంటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్దగా పబ్లిక్ పంక్షన్స్ లో కనిపించని పవన్ కళ్యాణ్..త్వరలో లండన్ లో జరిగే తెలుగు వేడకకు హాజరు కావటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయన సినిమాకువాళ్లు కానీ ఓ ప్రెవేట్ పంక్షన్ కు (పెళ్లిళ్లు వంటివి మినహాయిస్తే) హాజరవ్వటం ఇదే తొలిసారి.

వివరాల్లోకి వెళితే...కళారంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) వారు 6 వ వార్షికోత్సం లండన్ లో భారీ ఎత్తున జరుపబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నాడు.

జూలై 9, శనివారం సాయంత్రం 5గం.ల నుండి రాత్రి 11గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ లో తెలుగు వారందరిని అలరించడానికి చలన చిత్ర గానామృతం, నృత్య రూపకాలు, జానపద గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇక తెలుగు వారందరు ఈ కార్యక్రమానికి హాజరై ఈవెంట్ ని జయప్రదం చేయాలని వారు కోరారు.

Power Star in London on 9th July at Troxy

ఇక పవన్ కళ్యాణ్ తో బాటు కొంతమంది నటులు, గాయకులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. లండన్ లో ఉన్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేన్ (యూకేటీఏ) ఆరో వార్షికోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథి గా ఆహ్వానం అందుకున్నారు. వారికోరికపై పవన్ లండన్ లో జులై 9న జరిగే ఆ వేడుకకు హాజరవుతున్నట్లు తెలిసింది.

మరి పవన్ కళ్యాణ్ ..ఇలా వెళ్లటం వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా...తమ పార్టీకు సంభందించి ఎన్నారైలతో మాట్లాడి, వారిని సైతం కూడగట్టడానికే ఈ ప్రయాణం అని కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలి.

English summary
On the occassion of UKTA (United Kingdom Telugu Association) 6th Anniversary celebrations Power Star Pawan Kalyan attending as Chief Guest. For further details contact: uktauktas.org.uk
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu