»   » చిరంజీవి గెస్టుల లిస్టులో... పవన్ కళ్యాణ్ కూడా?

చిరంజీవి గెస్టుల లిస్టులో... పవన్ కళ్యాణ్ కూడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుగబోతున్నాయి. ఆగస్టు 22న మెగాస్టార్ 60వ వడిలోకి అడుగు పెడుతున్నారు. ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా రామ్ చరణ్ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. చరణ్ రెండు పార్టీలు ఏర్పాటు చేస్తున్ననట్లు తెలుస్తోంది. ఒకటి అభిమానుల కోసం కాగా... మరొకటి సినిమా పరిశ్రమలోని ప్రముఖుల కోసం.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన బోతున్నారని, ఈ వేడుకలో ఆయన స్పెషల్ అట్రాక్షన్ అవతారని తెలుస్తోంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే వేదికపై కనిపించబోతున్నారని, తామంతా ఒక్కటే... తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని మెగా ఫ్యామిలీ సందేశం ఇవ్వబోతోందని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మెగాస్టార్ బర్త్ డే పార్టీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 21 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అభిమానుల సమక్షంలో చిరు కేక్ కట్ చేస్తారని తెలుస్తోంది. ఆగస్టు 22న ఉదయం కుటుంబ కుటుంబ సభ్యులతో గుడి వెళ్లి, అనంతరం సినీ ప్రముఖులకు ఇచ్చే పార్టీలో పాల్గొంటారని సమాచారం.

Power star in Mega star guest list

కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యేలా, నేషనల్ మీడియాను సైతం ఆకర్షించేలా బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

చిరంజీవి 150వ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా... పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు స్వయంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక అభిమానులు పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు... రక్తదానం, నేత్రదానం క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. పేదలకు వస్త్రధానం, మొక్కలు నాటడం, అన్నదానం, స్పెషల్ పూజా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్.... ఇలా చాలా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Ram Charan is planning grand birthday celebrations for his dad Chiranjeevi turning 60 on August 22nd. Charan is hosting two birthday parties- one for fans and other for film industry. Guess what is going to be major attraction there.
Please Wait while comments are loading...