»   » మరో రీమేక్‌లో పవన్ కల్యాణ్.. పవర్‌స్టార్ ఇమేజ్ తగినట్టుగానే..

మరో రీమేక్‌లో పవన్ కల్యాణ్.. పవర్‌స్టార్ ఇమేజ్ తగినట్టుగానే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల పరాజయంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ రీమేక్ చిత్రాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. గతంలో గబ్బర్ సింగ్, గోపాలా గోపాలా చిత్రాలు పవన్‌కు భారీ హిట్లు తెచ్చిపెట్టాయి. స్ట్రెయిట్ చిత్రాలు నిరాశ గురిచేయడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

జాలీ ఎల్ఎల్బీ2లో..

జాలీ ఎల్ఎల్బీ2లో..

ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రం ఘన విజయం సాధించింది. అక్షయ్‌కుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కథ, కథనం ఆకట్టుకోవడమే కాకుండా బ్రహ్మాండమైన హాస్యానికి కూడా ఈ చిత్రంలో స్కోప్ ఉంది.

విక్టరీ వెంకటేశ్..

విక్టరీ వెంకటేశ్..

తొలుత జాలీ ఎల్ఎల్బీ2 చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ చేస్తున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమన్నాయి. వెంకీ చర్చలు జరుపుతున్నారని వార్తలు మీడియాలో హడావిడి చేశాయి. అయితే ఇలాంటి రూమర్లకు తెరదించుతూ పవన్ కల్యాణ్ పేరు తెరమీదకు రావడం చర్చనీయాంశమైంది.

తాజాగా పవన్ కల్యాణ్..

తాజాగా పవన్ కల్యాణ్..

హారిక అండ్ హసీని క్రియేషన్స్ వారు ఇటీవల జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకోగా, ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తోనే చేయాలని భావిస్తున్నారనేది తాజా వార్త సారాంశం.

కోర్టు రూమ్ డ్రామా

కోర్టు రూమ్ డ్రామా

కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రం బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లను సాధించింది. వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. సామజిక పరమైన అంశాల కూడా ఈ చిత్రంలో ఉండటం వల్ల పవన్ కల్యాణ్ అయితే బాగుంటదనే మాట వినిపిస్తున్నది.

English summary
Remake stories are very perfect for Pawan Kalyan. Gabbar Singh and Gopala Gopala is proved Power star stamina. After biggest flops of Sardar Gabbarsingh, Katamarayudu, now Pawan is going to remake the Jolly LLB2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu