twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమనుకుంటున్నవ్ రా?.. చంపేస్తాం అని బెదిరించారు.. పవన్ కళ్యాణ్

    తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు తనకు బెదిరింపులు వచ్చేవని, ‘ఏంట్రా?.. నువ్వు ఏమనుకుంటున్నావ్?.. నిన్ను చంపేస్తాం’ అని బెదిరింపు ఉత్తరాలు చాలా వచ్చాయని చెప్పాడు పవన్ కళ్యాణ్

    |

    హర్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ కూడా తనదైన శైలిలో ఆకట్తు కునే ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. నాషువాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించారు. తొలుత ఆంగ్లంలో ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఆకట్టుకొన్నారు. చాలా ఉద్వేగపూరిత ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ చేయడం గమనార్హం.

    తన సినిమాల విషయం లోకూడా జానీ సినిమతోనే ఆపేద్దామనుకున్నాననీ. ఇప్పుదూ తనకు రాజకీయాలలో ఉన్నంత కిక్ సినిమాలలో లేదనీ చెప్పిన పవన్ మరిన్ని విషయాలమ్ని కూడా పంచుకున్నాడూ. లోకల్ గా ప్రసంగాలు చేసినప్పుడు చెప్పని చాలా విషయాలను పవన్ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమాల పట్ల ఆయన దృక్పథం ఏమిటో చెప్తూ అసలు సినిమాలెందుకు చేస్తున్నదీ, ఎప్పటిదాకా చేసేదీ కూడా చెప్పేసాడు.

    Power star Pawan kalyan says that he will not tolerate injustice

    ఇంకెన్నాళ్లు సినిమాలు చేస్తానంటే చెప్పలేను. ఒకవేళ భాద్యతలు ఎక్కువైనప్పుడు అవి ఆలస్యం కావచ్చు. అలాగని సినిమాలంటే నాకు విముఖత లేదు. అవంటే నాకు గౌరవం. సినిమా వలన వచ్చిన ఇమేజ్ ను ఇలా ప్రజా సమస్యలపై పోరాటం కోసం వాడుకుంటున్నందుకు ఆనందంగా ఉంది' అన్న పవన్. జనసేన పార్టీ పెట్తిన కొత్తల్లో తనను చంపేస్తానంటూ బెదిరింపులని ఎదుర్కున్నా అంటూ కూడా చెప్పటం గమనార్హం.

    తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు తనకు బెదిరింపులు వచ్చాయని, అయినా తనకు భయం లేదని తన జాగ్రత్తలో తాను ఉన్నానని చెబుతూ... ప్రసంగం మధ్యలో ఎర్ర కండువాని తన మేడలో వేసుకుని "ఈ టవల్ గబ్బర్ సింగ్ కు సింబల్ కాదని సామాన్యుడి సింబల్" అని చెప్పాడు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉంటానని, బెదిరింపులకు భయపడేదిలేదని చెప్పిన జనసేన అధినేత . తనను చాలామంది చాలా రకాలుగా భయపెట్టారని చెప్పాడు.

    Power star Pawan kalyan says that he will not tolerate injustice

    'ఏంట్రా?.. నువ్వు ఏమనుకుంటున్నావ్?.. నిన్ను చంపేస్తాం' అని బెదిరింపు ఉత్తరాలు చాలా వచ్చాయని, బూతులు తిడుతూ కూడా రకరకాల ఉత్తరాలు కుప్పలుగా వచ్చాయని చెప్పాడు. అయినా తాను వేటికీ భయపడే రకం కాదని పవన్ స్పష్టం చేశారు. తనకు జాగ్రత్త ఉంది కానీ.. భయం లేదని చెప్పగానే సభ హాలు మొత్తం ఉద్వేగ పూరితమైన అరుపులతో నిండి పోయింది. .

    English summary
    Jana Sena chief Pawan Kalyan in his USA visit, said that faced some Warning Letters with unParliamentary language
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X