»   » కాటమరాయుడు లో మిస్సయ్యిందిదే... ఇప్పుడు చూపించారు

కాటమరాయుడు లో మిస్సయ్యిందిదే... ఇప్పుడు చూపించారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు గా పవన్ కనిపించనున్నాడు అనగానే అభిమానులంతా రకరకాల ఊహలు చేసారు అయితే వీరంమ్ లో అజిత్ లాగా ఏజ్డ్ లుక్ లో ఉన్న పవన్ లుక్ కనిపించగానే బావుందీ అనిపించినా ఎక్కడో ఏదో మిస్సౌతున్న ఫీలింగ్. నిజానికి పవన్ లుక్ కాస్త డిసప్పాయింట్ చేసింది. మొహం లో కాస్త వయసు లక్షణాలు కనిపించటం, కాటన్ లుంగీలో కనిపించటం బాగానే ఉన్నా అసలు పవన్ ఇలా ఉండటాం కాస్త ఫీలింగ్ ని తప్పించింది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త పోస్టర్ ని చూడగానే ఆ చింత కూడా తీరిపోయింది.

Powerstar Katamarayudu New poster

గళ్ల షర్ట్ మీద బ్లూ కలర్ టీషర్ట్ తో స్టైల్ గా పవన్ నడచుకుంటూ వస్తున్న పవన్ మళ్ళీ తన స్టైల్ ని చూపించాడు, పంచెకట్టు తరువాత ఆయనని ఇలా చూపించడం కొత్తగా వుంది. ఈ మీసకట్టులో పవర్ స్టార్ ఫ్రెష్ గా .. మరింత గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఖుషీ కాలం నుంచీ ఉండే పవన్ కి మాత్రమే ఉండే ఈజ్ ఈ లుక్ కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. మరింత యంగ్ గా పవన్ కనిపిస్తోన్న ఈ స్టిల్ ఆయన అభిమానులను ఆకట్టుకునేదిలా వుంది. ఈ స్టిల్ పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం తెచ్చింది.

English summary
Powerstar pawan kalyan's new poster from Katamarayudu with Pawan's regular look is creating sensation
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu