twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నష్టం మిగిలింది, డబ్బులు పోయాయి : ప్రభాస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నష్టం మిగిలింది. డబ్బులు పోవడమే మంచిదయ్యింది. అలా జరిగి ఉండకపోతే హీరో అవ్వడానికి ఇంకో రెండు, మూడేళ్లు ఆలస్యం అయ్యేది అంటున్నారు ప్రభాస్. ఆయన చిత్ర పరిశ్రమలోకి రాకముందు రొయ్యల చెరువుల సాగు చేసారు. ఈ విషయమై రీసెంట్ గా గుర్తు చేసుకుంటూ ప్రభాస్ ఇలా అన్నారు.

    అలాగే... నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఎప్పుడైనా 300, 400 ఎకరాలు కొనుక్కుని చక్కగా వ్యవసాయం చేసుకోవాలని ఉంది. అంతేకాదు, నేను తొమ్మిదో తరగతి చదివినప్పుడు 'ఆక్వా కల్చర్' చేశాను. ఇరవై ఏళ్ల వయసులో వేసవి సెలవుల్లో సరదాగా మా ఊళ్లో రొయ్యల చెరువు చేశాను అన్నారు. అలాగే ఇప్పటివరకైతే యాక్టింగ్ తప్ప వేరే శాఖ మీద దృష్టి లేదు.

    ఇక మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. గతంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాం. అది కొన్నాళ్ల పాటే. ఇలా నా జీవితంలో రెండూ నాకు అనుభవమే. ఇప్పుడు.. మీరడిగినట్లు పెట్రోల్ రేటు తెలియకపోవచ్చు. కానీ మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పారు.

    తనపై వచ్చే కామెంట్స్ గురించి వివరిస్తూ....అలా మా వరకూ చాలా విషయాలు వచ్చాయి. ఓసారి కాజల్, మరోసారి ఇలియానా పేరు వినిపించింది... ఏ సినిమా చేస్తే ఆ సినిమా హీరోయిన్‌తో ఇలాంటివి రావడం కామన్. అలాగే నా పెళ్లి ప్రయత్నాలు మొదలవ్వగానే అమ్మాయి ఎవరు? ఏ ఊరు? అనే విషయాలు నేను చెప్పక ముందే మీ వరకూ వచ్చేస్తాయి అన్నారు.

    English summary
    Prabhas happy with Mirchi film. He says he also involved in Aqua Culture. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X