»   » మేం ఏమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా...ప్రభాస్

మేం ఏమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా...ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సినిమాలో ఫస్టాఫ్‌ హీరో అల్లిన కథ అంతా అబద్ధం. సెకండాఫ్‌లో అసలు కథ ఆరంభమవుతుంది. కరుణాకరన్‌ కథ చెప్పినప్పుడు భలే వెరైటీగా ఉందే అనిపించింది. కానీ సినిమా పూర్తయ్యేసరికి భయం పట్టుకుంది. "మేం ఏమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా' అని ప్రేక్షకులు నెగటివ్‌గా రియాక్ట్‌ అవుతారని టెన్షన్‌ పడ్డాను. సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తే ఇలానే రకరకాలుగా అనిపిస్తుంది. ఫస్ట్‌ బాగుంది అనిపిస్తుంది. ఆ తర్వాత బాగాలేదేమో అనిపిస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించకూడదు. 'డార్లింగ్‌' విడుదలైనప్పుడు నేను ముంబయిలో ఉన్నాను. మొదటి రోజు నా సన్నిహితలు ఫోన్‌ చేసి 'టాక్‌ బాగుంది' అన్నారు. ఇంకేం చెప్పొద్దు..ఇది చాలు అని ఫోన్‌ పెట్టేశాను అంటున్నారు ప్రభాస్. ఆయన నటించిన 'డార్లింగ్' చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే...ఇటీవల నా సినిమాలకి సెకండాఫ్ మైనస్సవుతూ వచ్చింది. 'డార్లింగ్' మాత్రం ఆ విషయంలో సక్సెసయింది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ కొత్తగా ఉందనే టాక్ వచ్చింది అన్నారు.

అలాగే 'డార్లింగ్‌' విడుదల రోజు నేను వేరే పనిమీద ముంబైలో ఉన్నాను. తిరిగొచ్చాక హైదరాబాద్‌ లోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశాను. విరామ సన్నివేశాలను, ద్వితీయార్ధంలో వచ్చే పలు సన్నివేశాలను చప్పట్లు కొట్టి మరీ చూస్తున్నారు. నా గత చిత్రాలతో పోలిస్తే 'డార్లింగ్‌' క్లైమాక్స్ సన్నివేశాలు మరింత మెప్పించాయి. నా దృష్టిలో అభిమానులు ఎప్పుడు పార్టీలు చేసుకుంటే అప్పుడు ఆ సినిమా ప్రజలకు ఎక్కినట్టు. ఈ సినిమాకు మొదటిరోజే పార్టీలు చేసుకున్నారన్న వార్తలు వినిపించాయి. సంతోషంగా అనిపించింది. కానీ కొంతమంది పెద్దవారు మాత్రం ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది అని అన్నారు. సినిమాలో ఏం చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. మరీ ఎక్కువగా ఆలోచిస్తే ఏమీ చేయలేం. మనం చేసినవి ప్రేక్షకులను కొన్నిసార్లు మెప్పించలేకపోవచ్చు. ఈ చిత్రం యువతను దృష్టిలో పెట్టుకుని తీశాం. వారికి నచ్చడంతో మా లక్ష్యం నెరవేరింది అని ప్రభాస్ తేల్చారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu