»   »  ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు, ఆయనతో విభేదాల్లేవు, వెళ్లగానే మహానటి చూస్తా: దుబాయ్ మీడియాతో ప్రభాస్

ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు, ఆయనతో విభేదాల్లేవు, వెళ్లగానే మహానటి చూస్తా: దుబాయ్ మీడియాతో ప్రభాస్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Hero Prabhas Talks To Dubai Media On 'Saaho'

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజులుగా దుబాయ్‌లో 'సాహో' షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా దాదాపు 250 మంది చిత్ర బృందం సినిమాకు పని చేశారు. దాదాపు 3 వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ చిత్రీకరించారు. టైగర్ జిందాహై తర్వాత ఎక్కువ రోజులు దుబాయ్‌లో షూటింగ్ జరుపుకున్న భారతీయ సినిమా ఇదే. షూటింగ్ ముగిసిన అనంతరం ప్రభాస్ దుబాయ్ మీడియాతో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర అంశాలను పంచుకున్నారు. అబు దుబాయ్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు.

  నా జీవితంలో ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు

  నా జీవితంలో ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు

  నా సినీ కెరీర్లో చేసిన అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ మూవీ ఇది. ఈ సినిమాకు చేసినంత రిస్కీ సీన్లు ఎప్పుడూ చేయలేదు. ఇందులో బైక్ రేసింగ్ సీన్లలో నా జీవితంలో ఎప్పుడూ నడపనంత వేగంగా బైక్ నడిపాను అని ప్రభాస్ వెల్లడించారు.

   దుబాయ్ ప్రభుత్వ సహకారం మరువలేనిది

  దుబాయ్ ప్రభుత్వ సహకారం మరువలేనిది

  రంజాన్ సీజన్ కావడంతో షూటింగుకు అడ్డంకులు ఏర్పడతాయని భావించాం. కానీ దుబాయ్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాలుగా సహకారం అందించారు, మా కోసం అబు దుబాయ్ టీమ్ ట్రాఫిక్ కూడా నిలిపివేశారు అని ప్రభాస్ వెల్లడించారు. ఇక్కడ ప్రభుత్వం సినిమా షూటింగులకు అయ్యే ఖర్చులో 30 శాతం రిబేట్ ఇస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి అని ప్రభాస్ తెలిపారు.

  ఈ సినిమా కోసం బరువు తగ్గాను

  ఈ సినిమా కోసం బరువు తగ్గాను

  గతంలో బాహుబలి కోసం దాదాపు 10 కేజీల బరువు పెరిగాను. అయితే అన్ని సినిమాలకు అలాంటి ఫిజిక్ అవసరం ఉండదు. అందుకే సాహో కోసం బరువు తగ్గాను. స్పెషల్ డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది అని ప్రభాస్ వెల్లడించారు.

  కరణ్ జోహార్‌తో విబేధాలు లేవు

  కరణ్ జోహార్‌తో విబేధాలు లేవు

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ప్రభాస్ మధ్య విబేధాలు ఉన్నాయని, కరణ్ జోహార్ ఆఫర్ చేసిన రెండు సినిమాలను ప్రభాస్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభాస్ స్పందించారు. అందులో నిజం లేదన్నారు. ఈ రూమర్స్ గురించి కరణ్ జోహార్ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. మా ఇద్దరి మధ్య మంచి రాపో ఉంది అని యంగ్ రెబల్ స్టార్ తెలిపారు.

   ఇంటికి వెళ్లగానే మహానటి చూస్తాను

  ఇంటికి వెళ్లగానే మహానటి చూస్తాను

  ఇండియా వెళ్లగానే ‘మహానటి' సినిమా చూస్తాను, నాకు ఎంతో నచ్చిన నటి సావిత్రి అని ప్రభాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు అంటే ఇష్టమన్నారు. ప్రస్తుతం ఆయన తీస్తున్న సంజు మూవీ ట్రైలర్ ఎంతో నచ్చిందని తెలిపారు.

  రాజమౌళి పాకిస్థాన్ పర్యటనపై

  రాజమౌళి పాకిస్థాన్ పర్యటనపై

  పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలిని ప్రదర్శించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి పాక్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ అక్కడ మా సినిమాకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. పాక్ ప్రజలను రాజమౌళిని వెల్ కం చేసిన తీరు నచ్చింది. సినిమాలకు మాత్రమే ప్రజలను దగ్గర చేసే పవర్ ఉంది అని రాజమౌళి వెల్లడించినట్లు ప్రభాస్ తెలిపారు.

  English summary
  Prabhas offered an exclusive interview to Abu Dhabi Media recently. He shared few interesting details about his upcoming flick 'Saaho'. This was Prabhas' first visit to the capital and he enjoyed shooting for the action thriller in the city. "People are very nice, the mosque is so beautiful, I really enjoyed going to the museum in my free time. Every time we come here for a recce, we bump into a new place. The Abu Dhabi team stopped the traffic for us, they gave us the best roads and the best buildings and we are very grateful for that. We will definitely come again." He also said that it was not that difficult to shoot during Ramadan even though the team was a bit afraid initially.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more