»   » ‘సాహో’ తర్వాత ప్రభాస్ మరో ఫిల్మ్ ఖరారు

‘సాహో’ తర్వాత ప్రభాస్ మరో ఫిల్మ్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టు కోసం ఐదేళ్ల పాటు ఇతర సినిమాలేవీ తీయకుండా కేవలం ఆ ఒక్క ప్రాజెక్టుకే పరిమితం అయిన ప్రభాస్..... ఆ సినిమా పూర్తవగానే వరుస సినిమాలు కమిట్ అవుతూ దూసుకెలుతున్నారు.

ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళంలో తరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్..... దీని తర్వాత మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 'జిల్' మూవీ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కబోతోంది.


Prabhas' another film with Radha Krishna Kumar

ఈ విషయాన్ని రాధ కృష్ణ కుమార్ స్వయంగా వెల్లడించారు. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని ఆయన తెలిపారు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ నుండి వస్తున్న ప్రేమ కథా చిత్రం ఇదే అని అంటున్నారు.


ఈ బాహుబలిలోని డార్లింగ్ కోణాన్ని మరోసారి తన సినిమా ద్వారా చూపించబోతున్నాను, ప్రభాస్ తో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని రాధా కృష్ణ కుమార్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు.


English summary
"Hey everyone!! I am so very happy to announce my next movie with our very own Bahubali Prabhas. Hope to show the darling side of this Bahubali!! A pure Love story, on its way," 'Jil' fame Radha Krishna Kumar has announced
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu