»   » లవ్ చేస్తున్నాడు కాబట్టే లవ్ స్టోరీస్ చేయడం మొదలెట్టాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్...!

లవ్ చేస్తున్నాడు కాబట్టే లవ్ స్టోరీస్ చేయడం మొదలెట్టాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆమధ్య వచ్చిన 'ఛత్రపతి' సినిమాతో మంచి ఫేమ్..నేమ్ సంపాదించాడు. అయితే 'ఛత్రపతి' సినిమా తరువాత మళ్లీ ప్రభాస్ కు చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదనే చెప్పాలి. గత సంవత్సరం విడుదలైన 'డార్లింగ్' సినిమా యూత్ ను మాత్రమే ఆకట్టుకుంది. విశేషమేమిటంటే, యాక్షన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఇటీవలి కాలంలో సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేయడం! అందుకు తగ్గట్టుగా, ప్రస్తుతం చేస్తున్న 'మిస్టర్ పెర్ ఫెక్ట్' కూడా అటువంటి లవ్ స్టోరీనే. ఇదే టాలీవుడ్ లో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయంపై ప్రచారంలో వున్న సంగతేమిటంటే... ప్రభాస్ ఈమధ్య నిజజీవితంలో లవ్ లో పడ్డాడట. అందుకే యాక్షన్ మూవీస్ పక్కన పెట్టి, లవ్ మూవీస్ ని ఎంజాయ్ చేస్తున్నాడట..!

తాజాగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాని పూర్తి చేసిన ప్రభాస్ ఏప్రిల్ 4 నుంచి 'రెబల్' చిత్రం షూటింగులో పాల్గొంటాడు. డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ అయిన లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు గత డిసెంబర్ నెలలో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు నాలుగు నుంచి హైదరాబాదులో కంటిన్యుస్ గా జరుగుతుంది. ఆ తర్వాత ఈ చిత్రం యూనిట్ అవుట్ డోర్ షిప్ట్ అవుతుందని వినికిడి. 'బిల్లా' సినిమా తర్వాత మళ్లీ అనుష్క ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై దీనిని భగవాన్, పుల్లారావు కలిసి నిర్మిస్తున్నారు.

English summary
Now the latest news is that the movie of Prabhas's Rebel regular shooting will starts from April 4th onwards. This is going to be the highest budget film in Prabhas’s career. This mass entertainer film will be directed by Choreographer-turned-director Raghava Lawrence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu