»   » ప్రభాస్ మరీ ఇంత మంచోడా? (ఫోటోస్)

ప్రభాస్ మరీ ఇంత మంచోడా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తన ఇంట్లో పని చేస్తున్న యువతి వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచాడు. తన వద్ద పని చేసే వారికి ప్రభాస్ అన్ని ఆర్థిక సహాయం చేయడం తెలుసుగానీ, స్వయంగా పెళ్లికి హాజరై ఆశీర్వదించేంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్చ పోతున్నారు. ప్రభాస్ పై గౌరవం మరింత పెరిగిందని అంటున్నారు.

హైద్రాబాద్ చందానగర్ ప్రభాస్ ఇంట్లో పని చేసే యువతి వివాహం జరిగింది. ఈ వేడుకకు.. ప్రభాస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా కాసేపు అక్కడే కూర్చుని చాలామందితో కబుర్లు కూడా చెప్పాడు ప్రభాస్. ఈ సందర్భంగా కొందరు ప్రభాస్ ఫోటోస్ తీసి ఇంటర్నెట్లో పెట్టేసారు. ఇపుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి.


Prabhas Attends Maid Wedding

ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి' పార్ట్ 2 షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Prabhas Attends Maid Wedding

2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.

English summary
Prabhas stunned one and all with his noble gesture towards his maid. He took break from the shoot to attend wedding of his maid in Chandanagar, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu