»   » బి ప్రిపేర్ :అక్టోబర్ 23 ఫిక్స్, ఆ రోజు ఎక్కడ విన్నా ‘బాహుబలి 2’ గురించే

బి ప్రిపేర్ :అక్టోబర్ 23 ఫిక్స్, ఆ రోజు ఎక్కడ విన్నా ‘బాహుబలి 2’ గురించే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్ లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నరనే విషయం బయటకు వచ్చింది.

బాహుబలి చిత్రం హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ మరో రెండు నెలల్లో అంటే నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తికానుందని సమాచారం. 'బాహుబలి: ద బిగినింగ్‌'కు మించి 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'లో యాక్షన్‌ సీన్లు ఉంటాయని చెప్తున్నారు.

Bahubali

రాజమౌళి మాట్లాడుతూ...వాస్తవానికి బాహుబలి చిత్రం మొదటి పార్టులోనే స్టోరీ ముగించవచ్చు కానీ అది కట్టె కొట్టె తెచ్చే అన్న చందంగా ఉంటుందని అందుకే బాహుబలి 2 ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న కథతో బాహుబలి 2 ముగుస్తుందని రాజమౌళి చెప్పారు.

ఇకపోతే.. బాహుబలి 2లో ఆసక్తికర సన్నివేశాలుంటాయని, అనుష్క-రానాల మధ్య వార్ సన్నివేశాలు, రమ్యకృష్ణ-అనుష్కల మధ్య ఆసక్తికరమైన పోరాటాలుతో పాటు రొమాన్స్ సన్నివేశాలకు సైతం ఎలాంటి లోటుండదని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలిగా, శివగా ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి' ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది వీక్షించడం గమనార్హం.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న 'బాహుబలి 2'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

English summary
The trailer of magnum opus multi-lingual "Baahubali - The Conclusion", the sequel of the blockbuster "Baahubali: The Beginning," will be out on Prabhas' birthday on Oct. 23 as a special treat to the actor's fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu