»   » ఫోటో : ప్రభాస్‌ను పడగొట్టే దమ్ముందా?

ఫోటో : ప్రభాస్‌ను పడగొట్టే దమ్ముందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో ప్రభాస్ లాంటి పర్సనాలిటీ దాదాపుగా ఏ హీరోకూ లేదనే చెప్పాలి. డైరెక్టుగా ఆయనతో బాహాబాహీకి దిగితే ఆయన్ను పడగొట్టం ఎవరి వల్లా కాదు. ఒక రకంగా ప్రభాస్‌కు ఇలాంటి బలిష్టమైన ఫిజిక్ ఉండటం వల్లనే ప్రభాస్‌ను కోసం చత్రపతి, మిర్చి, బాహుబలి లాంటి కథలు రెడీ చేస్తున్నారు దర్శకులు.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో బాహుబలి సెట్‌లోనిది. ప్రభాస్ బాడీ చూసారా ఎలా ఉందో...ఆయనతో అలా ఎవరు పోటీ పడ్డా దాదాపు ఓటమి తప్పదు అనేలా ఉంది ఈ స్టిల్. బాహుబలి చిత్రం ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
Young rebel star prabhas and ace director SS Rajamouli's combo movie has been titled as 'Baahubali'. 'Baahu' means 'An Arm and a Shoulder' while 'Bali' means 'Strength'. So, the meaning of the title is " The strength of arms and Shoulders'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu