»   » ప్రభాస్ పుట్టిన రోజు విత్ తమన్నా (ఫొటోలు)

ప్రభాస్ పుట్టిన రోజు విత్ తమన్నా (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : బాహుబలితో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ తన పుట్టిన రోజుని తన మిత్రులతో కలిసి జరుపుకున్నారు. ఆ ఫొటోలను తమన్నా షేర్ చేసింది. తమన్నా, రానా, సెంధిల్ తో ప్రభాస్ ఉన్న ఫొటోలను ఈ క్రింద చూడండి.

మొదటి నుంచీ తమన్నాకు ప్రభాస్ కు మంచి ర్యాపో ఉంది. దాంతో ఈ పుట్టిన రోజుని చాలా ఉషారుగా జరుపుకున్నారు. ప్రభాస్ ని ఆమె పుబ్సీ అని పిలుస్తానని నిక్ నేమ్ ని రివీల్ చేసేసింది. ఇది ప్రభాస్ కు 35 వ పుట్టిన రోజు.

Prabhas celebrates b'day with Tamannaah Bhatia

తమన్నా కెరీర్ కు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హీరోయిన్ పదేళ్లు చిత్రసీమలో కొనసాగిందంటే నిస్సందేహంగా ఓ రికార్డే. రోజుకో కొత్త అందం వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకొని అవకాశాలు చేజిక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో దటీజ్‌ మహాలక్ష్మి అనిపించుకొంది తమన్నా. 'శ్రీ'తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె అటు అందంతోనూ, ఇటు నటనతోనూ అలరించింది. తిరుగులేని హీరోయిన్ గా వరుస విజయాలు అందుకొంది.

నటనలో తన శైలి గురించి తమన్నా చెబుతూ ''ఒక అడుగు ముందుకు పడిందంటే నా దృష్టి రెండో అడుగుపైనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకొనే అలవాటు ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు పరిణతి ఉన్న పాత్రల్లో నటించడంపైనే దృష్టిపెడుతుంటా'' అని వివరించింది.

Prabhas celebrates b'day with Tamannaah Bhatia

''ప్రతి హీరోయిన్ కీ 'క్వీన్‌', 'కహానీ' లాంటి సినిమాలు దొరకవు. చేతికొచ్చిన కథల్ని, మన నటనతో మనమే ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించాలి అంటోంది తమన్నా తక్కువ చేయలేం 'అరుంధతి', '100% లవ్‌','అలా మొదలైంది'లాంటి చిత్రాల్ని తక్కువగా చూడలేం. ఆ తరహా పాత్రల్ని రక్తికట్టించాలంటే ఎంతో పరిణతి కావాలి.

అందుకే .... ఏ కథల్నీ, పాత్రల్నీ తక్కువగా చూడకుండా, మనం వాటిని ఏ స్థాయిలో రక్తికట్టించగలమో ఆలోచించాలి. ఏదైనా కథ విన్నప్పుడు నాకు నప్పదనుకొంటే తిరస్కరిస్తాను తప్ప దర్శకుడి ఆలోచనల్ని, వాళ్లు రాసుకొన్న కథల్ని తక్కువగా అంచనా వేయను''అందితమన్నా. చేతిలో చిత్రాలు ఈమె రీసెంట్ గా బాహుబలిలో సందడి చేసింది. ప్రస్తుతం 'బెంగాల్‌ టైగర్‌'తో పాటు నాగార్జున- కార్తీ చిత్రంలోనూ నటిస్తోంది.

English summary
Wishing Prabhas warmest birthday wishes, Tamanna mentioned "Happy Birthday Pubsi" and that made the whole world know what would she call her hero. After working for years on the same project, seems like these two became good friends.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu