»   »  ప్రభాస్‌ 'ఫేస్‌బుక్‌' కవర్‌ మారిస్తేనే ఈ రేంజిలో ఉందంటే

ప్రభాస్‌ 'ఫేస్‌బుక్‌' కవర్‌ మారిస్తేనే ఈ రేంజిలో ఉందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేక్షకుల్లో ప్రభాస్‌కి ఏ స్థాయిలో ఆదరాభిమానలున్నాయన్న విషయం తాజాగా మరోసారి బయటపడింది. ఫేస్‌బుక్‌లో తన కవర్‌ ఫొటోని మార్చారు ప్రభాస్‌. బాహుబలిలో శివుడి గెటప్‌లో ఉన్న ఫొటోని కవర్‌గా అప్‌డేట్‌ చేశారు. అది గమనించిన అభిమానులు విశేషంగా స్పందించారు.

దీంతో రెండు గంటల్లోగా ఆ కవర్‌ ఫొటోకి 1,51,593 లైక్‌లొచ్చాయి. 1184 షేర్లు చేశారు. ఇప్పటికి ఆ లైక్ లు సంఖ్య రికార్డ్ స్ధాయిలో పెరిగిపోయి 448,706 కి చేరుకుంది. అలాగే 4,239 షేర్లు పెరిగిపోయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రభాస్‌ అభిమానులు సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రత్యేకంగా చర్చించుకోవడం కనిపించింది.

' బాహుబలి'తో ప్రభాస్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులేర్పడటమే దీనికి కారణం. ఇదివరకు ప్రభాస్‌ అంటే దక్షిణాదిలోనే గుర్తుపట్టేవారు. కానీ 'బాహుబలి' తర్వాత ఆయన ఎక్కడికెళ్లినా డార్లింగ్‌ డార్లింగ్‌... అంటూ వెంటపడుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్‌ని అంతగా ప్రేక్షకులకు చేరువ చేసింది ఆ చిత్రం.

Prabhas changed the cover of his Official Facebook

ప్రభాస్ కి వచ్చిన క్రేజ్‌ని చూసే పలు వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవటానికి ముందుకు వస్తున్నాయి. మరో ప్రక్క ఆయన ఇటీవల వరుసగా ఫ్యాన్ మీట్ లను ఏర్పాటు చేస్తున్నాడు. కమర్షియల్ బ్రాండింగ్ లలో కూడా చేయటం మొదలు పెట్టిన ప్రభాస్, ఇప్పుడు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. సేవా కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లోని జీసస్ ఓల్డేజ్ హోంకు 5 లక్షల రూపాయల విరాళం అందించాడు.

ప్రస్తుతం ప్రభాస్ ...తాను త్వరలో చేయబోయే బాహుబలి 2 కోసం జిమ్ కు వెళ్లి కండలు పెంచుతున్నాడు. అందుతున్న సమాచారాన్ని బట్టి డిసెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 2016 చివరకల్లా బాహుబలి 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Prabhas changed the cover of his Official Facebook account. He picked up Sivudu pose from “Baahubali” for cover. In just 12 hours after the upload, 3,00,000+ likes were seen for the latest activity.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu