»   » ‘రెబల్’లో ప్రబాస్ క్యారెక్టరేంటి?

‘రెబల్’లో ప్రబాస్ క్యారెక్టరేంటి?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బ్రతుకు మీద ఆశ లేని వాడే రణ రంగంలో అడుగు పెట్టాలి, యమ పాశం అడుగుదూరంలో ఉన్న చిరునవ్వు చిందాలి, అవకాశం వస్తే మాత్రం లక్ష్యం వైపు దూసుకు పోవాలి, చావుకు మస్కా కొట్టి మన పని మనం చేసుకోవాలి దానికి చాలా తెగువ కావాలి...అలాంటి క్యారెక్టర్ ప్రభాస్ ది రెబెల్ లో అంటున్నారు లారెన్స్. ప్రభాస్,లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం రెబెల్. ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెండు డైలాగులు.. "ఒక్కడు ఎదరు తిరిగితే తిరుగుబాటు....అదే వంద మంది ఎదురు తిరిగితే అది పోరాటం", "చరిత్రలో నిలచిపోయిన ఏ పోరాటం అయినా, వెనక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు... ముందుండి నడిపించిన ఒక్కడిని గురించి మాట్లాడుకున్నారు".

  ఇక షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. ఇక దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...'రెబల్" అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్" అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి". ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్" ఉంటుంది అన్నారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -''డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది.

  తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 15 నుంచి జరిగే మూడో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్‌ల్లో ఈ షెడ్యూల్ చేస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్" హై బడ్జెట్ ఫిలిం అవుతుంది"" అని చెప్పారు. 'ఈ చిత్రానికి సంగీతం: తమన్ , కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్"స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

  English summary
  Brathuku Meda Asha Leni Vade Rana Rangamlo Adugu Pettali,Yama Pasham Adugu Duramlo Vunna
 Chirunavvu Chindali,... Avaksham Vaste Matram Lakshyam Vaipu Dhusuku Povali,Chavuki Maska Kotti Mana Pani Manam Chesukovali Daniki Chala Teguva Kavali'' Alanti Character Prabhas Rebel lo Chestunnaru-Lawrence
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more