twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే రోజు 15 రకాల బిర్యానీలు తింటారా? ప్రభాస్ తిన్నాడు.. షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి

    బాహుబలిని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే క్రమంలో ప్రభాస్, రానాలు పడిన కఠోర శ్రమను ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. లండన్‌లో బాహుబలి ప్రమోషన్ కార్యక్రమంలో రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. నెలకొక

    By Rajababu
    |

    బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానాలు చాలా కష్టపడ్డారు. రాజుల నాటి పాత్రల కోసం కండలు తిరిగిన శరీరాన్ని భారీగా పెంచారు. దేహాదారుఢ్యం కోసం నానా రకాలుగా కసరత్తులు చేశారు. మోతాదుకు మించి ఆహారాన్ని తీసుకొన్నారు. ఓ దశలో వీరిద్దరూ వంద కిలోలపైగానే బరువు పెరిగారు. బాహుబలిని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే క్రమంలో ప్రభాస్, రానాలు పడిన కఠోర శ్రమను ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. లండన్‌లో బాహుబలి ప్రమోషన్ కార్యక్రమంలో రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

    ఒకే రోజు 15 రకాల బిర్యానీలు

    ఒకే రోజు 15 రకాల బిర్యానీలు

    ప్రభాస్‌ ఒకే రోజు 15 రకాల బిర్యానీలు తినేవాడు. సినిమా కోసం ప్రభాస్‌, రానాలు చాలా కఠిన ఆహార నియమాలు పాటించేవారు. నేనైతే అవి తినండి.. ఇవి తినండి అని ఏమీ చెప్పేవాడిని కాదు. వాళ్లే దేహదారుఢ్యం కోసం, సినిమాలోని పాత్ర కోసం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ప్రభాస్‌ గురించి మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి అని రాజమౌళి అన్నారు.

    ప్రభాస్, రానా చీట్ మీల్ ప్రొగ్రాం

    ప్రభాస్, రానా చీట్ మీల్ ప్రొగ్రాం

    నెలకొకసారి ప్రభాస్‌, రానా చీట్‌ మీల్‌ డే అని పెట్టుకొనేవారు. ఆరోజు మాత్రం ఎలాంటి ఆహార నిబంధనలు లేకుండా పుష్టిగా నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. చీట్ మీల్ అని చెప్పి ఓ రోజు ప్రభాస్‌ 15 రకాల బిర్యానీలు వండించుకున్నాడు. అసలు అన్ని రకాల బిర్యాలు ఉంటాయని కూడా నాకు మాత్రం తెలియదు. చేపల పులుసు, చికెన్‌, మటన్‌ కర్రీలు చేయించుకునేవాడు. కళ్లముందు అన్ని ఉన్నా చట్నీ లేకుండా మాత్రం తినేవాడు కాదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

    తెల్లారి 2 గంటల వేళ

    తెల్లారి 2 గంటల వేళ

    ఓరోజు తెల్లవారుజామున 2 గంటల వరకూ మేమంతా వాలీబాల్ ఆడాం. గేమ్‌ అయిపోగానే అప్పటికే సిద్ధం చేసిన పలు రకాల వంటకాలన్నీ తినడానికి సిద్ధమయ్యాడు. అన్ని వంటలను ఓసారి చూసి చట్నీ లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. వెంటనే పక్కన ఉన్న బావను చెట్నీ ఏదని అడిగాడు. దాంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తన భార్యను లేపి అప్పటికప్పుడు చట్నీ చేయించుకుని వచ్చారు. ప్రభాస్‌ మాత్రం ముందు ఆ చట్నీ తిన్నాకే మిగతా వంటలు తినడం మొదలుపెట్టాడు అని రాజమౌళి వెల్లడించారు.

    సాహో కోసం నాజుక్కుగా ప్రభాస్

    సాహో కోసం నాజుక్కుగా ప్రభాస్

    ‘బాహుబలి' చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం 100 కిలోల వరకూ బరువు పెరిగిన ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రం కోసం నాజుకుగా తయారయ్యాడు. బరువు తగ్గిన ప్రభాస్ సన్నగా కుర్రాడిలా తయారయ్యాడు. సుజీత్‌ దర్శకత్వ వహిస్తున్న ‘సాహో' చిత్రం ప్రస్తుతం ప్రి ప్రోడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. యువీ క్రియేషన్స్‌ పతాకం తెరకెకిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Rajamouli revealed that once in a month, Prabhas and Rana Daggubati will have a cheat meal day. On that day, you should see the kind of display Prabhas has. 10-15 kinds of biriyanis, just biriyanis. No exaggeration. You don’t even know those varieties of biriyanis even exist. Varieties of fish, chicken, mutton, and not just curries, even fries. You can’t just imagine the kind of display he has,” he recalled during media interactions in London, when Baahubali 2 was screened at the British Film Institute sometime back.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X