»   » అఫీషియల్ : ప్రభాస్‌ చీఫ్ గెస్ట్

అఫీషియల్ : ప్రభాస్‌ చీఫ్ గెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శర్వానంద్‌, సురభి జంటగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి నటుడు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Prabhas is the chief guest for #ExpressRaja audio launch!


Posted by Express Raja on 16 December 2015

ఈ కార్యక్రమం ఈనెల 19న జరగనున్న విషయం తెలిసిందే. ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రభాస్‌ అంగీకరించడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.నిర్మాతలు మాట్లాడుతూ ....మా బ్యానర్‌లో రన్‌ రాజా రన్‌ చిత్రంతో శర్వానంద్‌ మా కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. మళ్లీ మా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ నుండి టీజర్‌ వరకూ హ్యూజ్‌ రెస్పాన్స్‌ రావటం చాలా ఆనందంగా ఉంది.


వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంతో సక్సస్‌ని అందుకున్న మేర్లపాక గాంధి ఈ చిత్రానికి దర్శకుడు. సురభి హీరోయిన్ . అలాగే డిసెంబరు 19న అభిమానుల సమక్షంలో ఈ చిత్రం యొక్క ఆడియోని విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాము. మా బ్యానర్‌ నుండి ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో ఆరేంజిలో మా ఎక్స్‌ప్రెస్‌ రాజా ఉంటుంది అని అన్నారు.


Prabhas confirmed for Express Raja Audio

శర్వానంద్‌, సురభి, ఊర్వ హరీష్‌ ఉత్తమన్‌, పోసాని కృష్ణ మురళి, సూర్య, నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్‌, సప్తగిరి, ప్రభాస్‌ను, షకలకశంకర్‌, ధనరాజ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ - ప్రవీణ్‌ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్‌ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ - సందీప్‌.ఎన్‌, ఎడిటర్‌- సత్య.జి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ - ఎస్‌.రవిందర్‌, లిరిక్స్‌ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్‌ - రాజు సుందరం, విశ్వ, రఘు, చీఫ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - తోట ఫైట్స్‌ - స్టంట్‌ జాషువా,ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌- ఎమ్‌.కష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్‌, పి.ఆర్‌.ఒ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, పబ్లిసిటి డిజైనర్‌ - వర్కింగ్‌ టైటిల్‌ (శివకిరణ్‌). స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ -మేర్లపాక గాంధి.

English summary
Prabhas is the Chief guest for Sharwanand 's ExpressRaja music launch on Dec 19th, hyderabad !
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu