»   » దశరధ్, ప్రభాస్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...

దశరధ్, ప్రభాస్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ రాజు నిర్మాతగా ప్రబాస్, దశరథ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం మార్చి 27 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. మున్నా చిత్రం అనంతరం ప్రభాస్ తో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఇది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శాన్ ప్రాన్సిస్కో,యుఎస్ ఎలలో షూటింగ్ జరగునుంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా తపస్వి,సారా అనే ఇద్దరు కొత్త వాళ్ళను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, కరుణాకరణ్ తో చేస్తున్న డార్లింగ్ చిత్రం బిజీలో ఉన్నారు. వేసవి విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ చివర స్టేజికి చేరుకుంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న మరో చరిత్ర చిత్రం మార్చి ఇరవై ఐదున రిలీజ్ కానుంది. కమల్, సరితల సూపర్ హిట్ మరో చరిత్రకు ఇది రీమేక్. రవి యాదవ్ అనే కెమెరామెన్ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వరుణ్ సందేశ్, అనిత ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఇక దశరధ్ తన స్వాగతం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని స్క్రిప్టు చేసి ఈ చిత్రం చేస్తున్నారు. సంతోషం తర్వాత సరైన హిట్ లేని దశరధ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ చిత్రం హీరో ప్రేమ విలువ తెలుసుకునే ఓ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. అలాగే బొమ్మరిల్లు మాదిరి తండ్రి కొడుకుల రిలేషన్ కూడా ఈ చిత్రంలో ఓ ద్రెడ్ గా నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu