»   » ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజామాబాద్‌: తమ హీరో పుట్టిన రోజు వేడక అంటే మిగతా హీరోల వాటికన్నా బాగా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తూంటాయి. అయితే ఊహించని విధంగా అవి ప్రమాదాలకి దారి తీస్తూంటాయి.

హీరో పుట్టినరోజుకి, కొత్త సినిమాకి హంగామా చేసే ఈ ఫ్యాన్స్ ఒక్కోసారి తమ ప్రాణాలకే తెచ్చుకుంటారు. మొన్నామధ్య ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన వివాదం, హత్య మరవకముందే మరో హీరో అభిమాని ప్రమాదవసాత్తూ మృతి చెందారు.

Prabhas fan died @Birthday celebrations

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌ జిల్లాలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆదివారం (అక్టోబర్‌ 23న) బాహుబలి, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్‌లోని అభిమానులందరూ అతని జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ వేడుకల సందర్భంగా అభిమానుల్లో ఒకడైన ప్రశాంత్‌ (19) అనే యవకుడు తన అభిమాన హీరో ఫ్లెక్సీని కడుతుండగా ఆకస్మాత్తుగా విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ తగిలింది. విద్యుత్‌ షాక్‌తో అభిమాని ప్రశాంత్‌ అక్కడిక్కడే మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. ఈ వార్తతో ప్రబాస్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. ఇంకా ఈ విషయమై హీరో ప్రభాస్ స్పదించలేదు. త్వరలో స్పందిస్తారని అభిమాన సంఘాలు భావిస్తున్నాయి.

English summary
A 19-year-old youth from Nizamabad lost his life while doing his bit in the celebrations for his hero Prabhas’ birthday on October 23 in Nizamabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu