»   » కేరళలో 'బాహుబలి' (కొత్త ఫోటోలు)

కేరళలో 'బాహుబలి' (కొత్త ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జక్కన్న శిల్పం... బాహుబలి కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు మాత్రమే కాదు...తెలుగు సినీ ప్రరిశ్రమ చూపు మొత్తం 'బాహుబలి'పైనే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి.

మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కేరళలో ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.


మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్‌ కూడా ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్‌ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్‌ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది.

'బాహుబలి' కొత్త ఫోటోలతో కూడిన స్లైడ్ షో లో...

బ్లూ మ్యాట్ లో చిత్రీకరణ

బ్లూ మ్యాట్ లో చిత్రీకరణ

ప్రస్తుతం కేరళలలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడే కొన్నీ కీలకమైన సీన్స్ తీస్తారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో సెవెంటీ పర్శంట్ వరకూ షూట్ జరగనున్నట్లు సమచారం. అందులోనూ గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని, బ్లూ మ్యాట్ వర్కు బాగా ఉంటుందని తెలుస్తోంది.

కత్తియుద్ధాలు

కత్తియుద్ధాలు

ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రభాస్‌, రానా, అడవి శేష్‌ తదితరులు కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు నేర్చుకొని సెట్‌లోకి అడుగుపెట్టారు. పాత్రలకు తగ్గట్టుగా గుబురు గడ్డం కూడా పెంచారు.

రెండు పాత్రల్లో ప్రభాస్‌?

రెండు పాత్రల్లో ప్రభాస్‌?

ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తెరపై రానా వృద్ధుడిగా కనిపిస్తారని, ఆయనకి తనయుడిగా అడవిశేష్‌ కనిపిస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే సినిమాకి సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా బయటకు పొక్కకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రభాస్‌ ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఆహారపు నియమాలు పాటిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా జిమ్ లో ట్రైనర్స్ సహాయంతో కండలు పెంచారు. ఈ చిత్రంలో ప్రబాస్ ని చూసి షాక్ అవుతారంటున్నారు.

రాజమాతగా..

రాజమాతగా..

‘బాహుబలి' లో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్, రానాల తల్లిగా నటించనుంది. గతంలో ‘అమ్మోరు' సినిమాలో అమ్మేరు పాత్రలో నటించి అందరిని మెప్పించిన తను రాజసం ఉట్టిపడే ఈ పాత్రకి సరైన న్యాయం చేస్తుందని అందరూ బావిస్తున్నారు. ఈమె పాత్ర నెగిటివ్ టచ్ తో సాగుతుందని సమాచారం.

పార్ట్‌ 2 కూడా...

పార్ట్‌ 2 కూడా...

'బాహుబలి'ని రెండు భాగాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. కథరీత్యా నిడివి కాస్త పెరుగుతుందని తెలియడంతో సినిమాని రెండు భాగాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్


సుమారు రూ: 150కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్స్‌ని తీర్చిదిద్ది చిత్రీకరణని జరుపుతున్నారు. ఈ సెట్స్ కే చాలా ఖర్చు అయ్యిందని చెప్తున్నారు. ఇక ఆర్టిస్టులకు ట్రైనింగ్ లు, రెమ్యునేషన్స్ కలిపితే చాలా అవుతుందని భావిస్తున్నారు.

ప్రశంసల వర్షం

ప్రశంసల వర్షం

కళాదర్శకుడు సాబుసిరిల్‌ ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీస్థాయి సెట్స్‌ తీర్చిదిద్దారు. ఆ సెట్స్‌ని ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. దర్శకుడు రాజమౌళిని, సాబుసిరిల్‌ని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. వంద అవార్డులు వచ్చినంత ఆనందంగా ఉందంటూ ఆ లేఖని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు రాజమౌళి.

ఆ భాషల్లో కూడా...

ఆ భాషల్లో కూడా...

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెంచ్‌, జపనీస్‌, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లోకి అనువదించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

సత్యరాజ్...

సత్యరాజ్...

'బాహుబలి' లో 'కబ్బా' అనే పాత్రలో సత్యరాజ్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం గుర్రపుస్వారీ, కత్తిపోరాటాలపై శిక్షణ తీసుకుంటున్నారని తమిళ సిని వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన గుండు గీయించుకున్నారు. గతంలో ఆయన గుండు గీయించుకుని చేసిన చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. . '100వదు నాల్‌'లో విలన్ గా తనదైన నటన ప్రదర్శించి కోలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జల్లికట్టు', 'అమైదిపడై', 'మారన్‌'వంటి పలు సినిమాలు చేశారు. వీటి కోసం ఆయన గుండు గీయించుకుని నటించడం విశేషం.

సుదీప్ సూపర్బ్

సుదీప్ సూపర్బ్

'బాహుబలి' లో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. ఈ విషయమై సుదీప్ మీడియాతో మాట్లాడుతూ... నేను బాహుబలి చిత్రంలో ఆయుధాల వ్యాపారిగా కనిపిస్తాను. నా పాత్ర పేరు అస్లం ఖాన్. అంతేగాక ఈ చిత్రంలో నాకు సత్యరాజ్ కు మధ్య కత్తి పైట్ సీన్ ఉందని అన్నారు. అలాగే సుదీప్ ట్వీట్ చేస్తూ..." బాహుబలి షూటింగ్ ఖచ్చితంగా ఓ మంచి ఎక్సపీరియన్స్ , చాలా అద్బుతమైన సెట్స్, మంచి టీమ్ , రాజమౌళి గారితో మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలతో ట్వీట్ చేస్తాను ." అన్నారు.

English summary
'Baahubali' team is in 'Gods Own Country', Kerala to shoot the latest schedule of the movie. And as per the latest news male lead, Prabhas, has completed shooting his part and it is learnt that the rest of the team will stay in Kerala for some more days, till December 3rd to be precise, and finish the remaining part of this schedule. ‘Baahubali’, is the prestigious & the highest budgeted project that is being made at present in Tollywood, will soon be shot in Kerala. The movie is being made by Arka Media Works, lead by Sobha Yarlagadda &Prasad Devineni. M.M.Keeravani is the music director of the movie. 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu