»   » ప్రభాస్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. భారీగా పెంచేసిన బాహుబలి..

ప్రభాస్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. భారీగా పెంచేసిన బాహుబలి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్ ఓ సంచలనం. రూ.1000 కోట్లు సాధించిన చిత్రం హీరోగా చరిత్రకెక్కాడు. ఇండియన్ సినిమాలో అత్యంత నమ్మకమైన హీరోల్లో ప్రభాస్ ఒకడిగా పేరుతెచ్చుకొన్నాడు. బాహుబలి ఘన విజయంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మార్మోగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి అందించిన విజయంతో ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అదే స్థాయిలో తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు వార్తలు సినీ వర్గాల్లో హడావిడి చేస్తున్నాయి.

30 కోట్లు రెమ్యునరేషన్

30 కోట్లు రెమ్యునరేషన్

బాహుబలి కోసం ప్రభాస్ తన కెరీర్‌ను పణంగా పెట్టాడు. ఐదేళ్లు శ్రమించినందుకు అరుదైన గౌరవం దక్కడమే కాకుండా భారీ రెమ్యునరేషన్ ముట్టింది. బాహుబలి సినిమాకు తీసుకొన్న మొత్తానికి రూ. 5 కోట్లు పెంచినట్టు తెలుస్తున్నది. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ సుమారు రూ.25 కోట్ల పారితోషికం అందుకొన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆ మొత్తంతో పెంచిన రెమ్యునరేషన్ మొత్తం రూ.30 కోట్లకు చేరుకున్నట్టు సమాచారం.


హాట్ టాపిక్‌గా ప్రభాస్..

హాట్ టాపిక్‌గా ప్రభాస్..

ప్రస్తుతం ప్రభాస్ రెమ్యునరేషన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ హీరోలుకు తలదన్నేలా రెమ్యునరేషన్ అందుకోవడం చర్చనీయాంశమైంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి2 సినిమాతో ప్రభాస్ దశ తిరిగింది. తదుపరి చిత్రం సాహోను కూడా సొంత బ్యానర్ యూవీ క్రియేషన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం గమనార్హం.


ఐపీఎల్‌ను ఎదురించిన ..

ఐపీఎల్‌ను ఎదురించిన ..

గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతుందంటే బాలీవుడ్, టాలీవుడ్ ఇతర సినిమాలను విడుదల చేయాలంటే ముందు వెనుక ఆలోచించేవారు. ఐపీఎస్ నడస్తుంటే ఫస్ట్, సెకండ్ షోల కలెక్షన్లు భారీగా క్షీణించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్‌కు బాహుబలి2 చిత్రం ముప్పుగా మారడం విశేషం. ఐపీఎల్ ప్రభావం లేకుండా బాహుబలి2 కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది.


ఇతర నటీనటుల వివరాలు

ఇతర నటీనటుల వివరాలు

బాహుబలి2 సినిమాలో నటించిన ఇతర నటీనటుల పారితోషికం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రంలో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా దగ్గుబాటికి రూ.15 కోట్లు, అనుష్క, తమన్నాకు చెరో ఐదుకోట్లు, రమ్యకృష్ణకు రూ.2.5 కోట్లు, కట్టప్ప సత్యరాజ్‌కు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.English summary
After Baahubali2 Success, Reports says that Actor Prabhas has upped his fee by Rs 5 crore. According to Reports Prabhas was drawing a package of Rs. 25 crore. Now he will be demanding about Rs 30 crore. As per Industry sources, Prabhas‘ fee hike is concerned he totally deserves it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu