»   » ప్రభాస్ ‘డార్లింగ్’ సక్సెస్ కి కారణం ‘మగధీర’ !?

ప్రభాస్ ‘డార్లింగ్’ సక్సెస్ కి కారణం ‘మగధీర’ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా కాలం గ్యాప్ తర్వాత 'డార్లింగ్"తో మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సక్సెస్ వెనుక 'మగధీర" రామ్ చరణ్ సలహఆ వుందనే పర్సనల్ గా తనకెంతో నచ్చిన 'తొలిప్రేమ" చిత్ర దర్శకుడు కరుణాకరన్ తో కలిసి వర్క్ చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్ చూపించాడట చరణ్. అయితే కరుణాకరన్ వచ్చి సబ్బెక్ట్ చెప్పే టైమ్ కి 'మగధీర" అండర్ ప్రొడక్షన్ లో వుంది. దాని తర్వాత 'ఆరంజ్" స్ర్కిప్ట్ రెడీ అవుతోండటంతో ఈ రెండు సినిమాలు పూర్తయ్యేవరకూ నేను మీ సినిమా కన్ ఫర్మ్ చెయ్యలేను. మిమ్మల్ని కూడా అన్ని రోజులు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అన్నారట.

అయితే అంతటితో గమ్మనుండక సబ్జెక్ట్ చాలా బాగుంది ఇదే క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే ఇంకా బాగుంటుందని చిన్న అడ్వైజ్ ఇచ్చి. మీరు ప్రొసీడ్ అవ్వండి" అని చెప్పి ప్రభాస్-కరుణాకరన్ ల 'డార్లింగ్" కాంబినేషన్ సెట్ అవడానికి ముఖ్య కారకుడయ్యాడు చరణ్. చెర్రీ జడ్జిమెంట్ నిజమై ఈ చిత్రం ఇప్పుడు విజయపథంలో పయనిస్తోంది. కాగా కరుణాకరన్ చెయ్యబోయే తదుపరి చిత్రం చరణ్ తోనే వుంటుందని తెలుస్తోంది. మరి ఆయన అభిమానులు పూర్తి వివరాల కొరకు మరికొన్నాళ్ళు వేచి చూడాల్పిందే!

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu