»   » బాహుబలిలో ప్రభాస్ మాదిరిగానే.. జలపాతం పైనుంచి దూకి.. అభిమాని మృత్యువాత

బాహుబలిలో ప్రభాస్ మాదిరిగానే.. జలపాతం పైనుంచి దూకి.. అభిమాని మృత్యువాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంలో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు రాజమౌళి. సిల్వర్ స్క్రీన్ మీద సాంకేతిక అంశాలతో రూపొందించిన చాలా సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. వాటిలో బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో దీవరా అనే పాటలో అవంతికను పట్టుకోవడానికి ఎత్తైన జలపాతాలపై నుంచి ప్రభాస్ దూకే సీన్లు నభూతో నభవిష్యత్‌గా అనిపిస్తుంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో ఆ పాట హైలెట్‌గా నిలిచింది. ఆ పాటను చూసిన ఓ సినీ అభిమాని నిజంగానే ఎత్తైన కొండపై దూకి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొన్నది.

విహారయాత్రలో విషాదం..

విహారయాత్రలో విషాదం..

బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం ముంబైకి చెందిన ఇంద్రపాల్ పాటిల్ వ్యాపారవేత్త. మహారాష్ట్రలోని షాపూర్ సమీపంలోని మహులి ఫోర్ట్ వద్ద జలపాతం వద్దకు విహార యాత్రకు వెళ్లాడు. ప్రభాస్ మాదిరిగానే ఎత్తైన జలపాతంపై నుంచి దూకాడు. అయితే దురదృష్టవశాత్తూ పట్టుకోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ ప్రాంతంలో యాత్రికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. విహారయాత్ర కాస్తా విషాదంగా మారింది.

నా సోదరుడిని ఎవరో తోశారు.

నా సోదరుడిని ఎవరో తోశారు.

అయితే ఇంద్రపాల్ సోదరుడు ఈ ఘటనపై ఆరోపణలు సంధించాడు. తన సోదరుడి అలాంటి పనులకు పాల్పడే వ్యక్తి కాదు. ఎవరో ఒకరు జలపాతం మీద నుంచి తోసి ఉంటాడు. అందువల్లనే నా సోదరుడు మరణించాడనే అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఇంద్రపాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వారంలో రెండో ఘటన

ఈ వారంలో రెండో ఘటన

మహారాష్ట్రలోని మహులి ఫోర్ట్‌కు సమీపంలోని జలపాతం వద్ద ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం గత రెండువారాల్లో ఇది రెండో ఘటన అని షాపూర్ పోలీసులు తెలిపారు. బాహుబలిలో ప్రభాస్ స్ఫూర్తితో బాధితుడు ఇంద్రపాల్ ఈ చర్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమే..

ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమే..

మహులి ఫోర్ట్ వద్దనున్న జలపాతం వద్ద వారంలో రెండు, మూడు రోజులకోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటాయి. చాలా మంది గాయపడుతుంటారు. వానకాలం ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటాయి. గతనెల ఓ వ్యక్తి జలపాతం పైకి చేరుకొని గుండెపోటుతో మరణించాడు. దాంతో ఆ ప్రాంతాన్ని నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించేందుకు చర్యలు తీసుకొంటున్నాం.

చర్యలు తీసుకొంటున్నాం..

చర్యలు తీసుకొంటున్నాం..

బాహుబలి చిత్రంలో మాదిరిగా యువకులను దూకకుండా చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు. తాము చేపట్టే చర్యల వల్ల మరణాలను అడ్డుకోవచ్చనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. అనేక చర్యలు చేపట్టినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Most of the scenes in movies have inspired fans off screen to imitate the same. One such scene is Baahubali’s jump from the cascading waterfall in Bahubali: The Beginning. Indrapal Patil, a business man from Mumbai jumped from a waterfall at Mahuli Fort in Shahapur, missed landing on his feet and thereafter lost his life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu