»   » నైజాం కింగ్స్ లో జూ ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాసే ...

నైజాం కింగ్స్ లో జూ ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాసే ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ హీరోకైనా నైజాంలో మంచి వసూళ్లు వస్తే స్టార్ గా అతని స్టేటస్ ఎన్నో రెట్లు పెరిగినట్టే. ఎందుకంటే తెలుగు సినిమాకి మాగ్జిమం మార్కెట్ ఇక్కడే ఉంది. ఈ ఏరియాలో ఇరవై కోట్ల పైగానే బిజినెస్ చేయవచ్చునని మగధీర నిరూపించింది. మగధీరలాంటి యుగానికో సినిమాని పక్కన పెడితే నైజాంలో బెస్ట్ బిజినెస్ మార్క్ పది కోట్లని చెప్పాలి. ఏ సినిమా అయినా ఈ మార్కు దాటితే తిరుగులేకుండా సూపర్ హిట్ అయినట్టే.

ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఈ ఏరియాలో పది కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అంచనాలున్నాయి. ఇంతకుముందే నైజాంలో ప్రభాస్ తన పట్టు చాటుకున్నాడు కానీ ఇంతదాకా భారీ హిట్ లేదు. ఆ లోటుని తీర్చి మిస్టర్ ఫర్ ఫెక్ట్ అతడిని నైజాం కింగ్స్ లో ఒకడిని చేసింది. మహేష్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తదితరులు కొందరు మాత్రమే కన్సిస్టెంట్ గా నైజాం లో బిజినెస్ చేయగల ధీరులని నిరూపించారు. పెద్ద స్టారే అయినా ఎన్టీఆర్ కి నైజాంలో అంత ఆదరణ దక్కడంలేదు. అతనికి సీడెడ్, గుంటూరులాంటి ఏరియాల్లో చాలా మంచి బిజినెస్ జరుగుతుంటుంది.

English summary
Young Rebel Star Prabhas, Kajal Agarwal, Tapsi starring new film Mr perfect was released on 22nd April. This film had collected a share around Rs 3.6 crores in the first three days. Now the film second week collections in Nizam 6.37. It is highest ever collection in Prabhas’s film career in Nizam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu