దుబాయ్ ప్రభుత్వంపై ప్రభాస్ ప్రశంసలు.. 90 కోట్లతో..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రానికి దర్శకుడు సుజిత్ రెడ్డి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ తార శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం వద్ద చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ సారధ్యంలో షూట్ జరుగుతున్నది.
దుబాయ్‌లో 'సాహో' ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. సుమారు 250 మంది యూనిట్ సభ్యులతో 50 రోజులపాటు అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోన్నది. ఈ యాక్షన్ సీన్ కోసం రూ. 90 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. 'టైగర్ జిందా హై' తర్వాత భారీ స్థాయిలో అక్కడ చిత్రీకరణ జరుపుకుంటోన్న అతి పెద్ద సినిమా ఇదేనని సమాచారం.

ఈ నేపథ్యంలో అబుదాబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాస్ మాట్లాడారు. 'అబుదాబిలో చిత్రీకరణ జరుపుకోవడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. దుబాయ్ అధికారులు, ప్రభుత్వం, ప్రజలు, అభిమానుల నుంచి మాకు అందుతున్న సహాయం చూశాక నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాకు దుబాయ్ ప్రభుత్వం 30 శాతం రాయితీని ఇచ్చింది అని ప్రభాస్ అన్నారు.


Click it and Unblock the Notifications











