»   » ప్రభాస్... స్మూత్ కిల్లర్ లుక్, అసలు ఎవరికీ నచ్చడం లేదు!

ప్రభాస్... స్మూత్ కిల్లర్ లుక్, అసలు ఎవరికీ నచ్చడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఈశ్వర్' సినిమా నుండి బాహుబలి-2 సినిమా వరకు ప్రభాస్ ఎప్పుడూ మీసాలు లేకుండా కనిపించలేదు. తొలిసారి ప్రభాస్ మీసాలు కూడా లేకుండా క్లీన్ షేవ్‌తో స్మూత్ కిల్లర్ లుక్‌లో కనిపించడం చూసి అభిమానులు షాకవుతున్నారు.

ఈ లుక్ ప్రభాస్‌కు అస్సలు సూట్ కాలేదని.... బాహుబలిలో రాజసం ఉట్టిపడేలా ఉన్న ప్రభాస్ లుక్ చూసిన తమకు ఈ లుక్ అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. త్వరలో సాహో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో..... ప్రభాస్‌ లుక్ పూర్తిగా మారిపోనుంది.


క్లీన్ షేవ్ అందుకేనా?

సాహో సినిమాలో ప్రభాస్‌ను కొత్తగా ప్రజెంట్ చేయడంలో భాగంగా ఇదంతా చేసారని, ‘సాహో' సినిమాలో కొన్ని సీన్లలో ప్రభాస్ మీసాలు లేకుండా కనిపిస్తారని, అందుకు సంబంధించిన సీన్లు ముందు చిత్రీకరించడంలో భాగంగానే ఇలా క్లీన్ షేవ్ లుక్ లోకి మార్చినట్లు తెలుస్తోంది.


సాహో

సాహో

సుజీత్ దర్శకత్వంలో సాహో చిత్రం తెరకెక్కుతోంది. రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.


ప్రభాస్ క్రేజ్

ప్రభాస్ క్రేజ్

బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ సినిమాలకు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ మార్కెట్లలో కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఇపుడు ప్రభాస్ సినిమా అనగానే ఈరోస్ లాంటి పెద్ద సినీ నిర్మాణ సంస్థలు వందల కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నాయి.


అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

ఇప్పటికే విడుదలైన ‘సాహో' టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. బాహుబలి-2 సినిమాతో పాటు ఈ టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా బాగా పెరిగింది. 2018లో సాహో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.English summary
This new picture of Prabhas is currently going viral on social media. With a clean shaven look, Prabhas looks almost unrecognizable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu