»   » బ్రహ్మీ కోసం ప్రభాస్, రాజమౌళి ఇలా... (ఫోటోలు)

బ్రహ్మీ కోసం ప్రభాస్, రాజమౌళి ఇలా... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రహ్మానందం తనయుడు రాజా గౌతం హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బసంతి'. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని పరిశ్రమలో నిలదొక్కుకునేలా ప్లాన్ చేసిన బ్రహ్మానందం తన పలుకుబడి అంతా ఉపయోగించారు. కేవలం సినిమా కథను, దర్శకుడిని, టాలెంటును మాత్రమే నమ్ముకుంటే లాభం లేదు...సినిమా జనాలకు చేరాలంటే అదే స్థాయిలో పబ్లిసిటీ అవసరం అని గ్రహించి....'బసంతి' చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి స్టార్ హీరోలను, స్టార్ దర్శకులను రంగంలోకి దింపారు.

టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కళ్యాణ్‌తో ఆడియో విడుదల చేయించడంతో పాటు, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, టాప్ దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి తదితరులతో సాంగు ప్రోమోలను విడుదల చేయించారు. 'బాహుబలి' హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళిలతో కూడా సినిమా సాంగు ప్రోమోలను విడుదల చేయించారు.

బాహుబలి షూటింగులో బిజీగా ఉన్న ప్రభాస్, రాజమౌళి వచ్చే అవకాశం లేక పోవడంతో.....'బసంతి' టీం 'బాహుబలి' సెట్‌కి వెళ్లింది. రాజమౌళి, ప్రభాస్‌లతో సాంగ్ ప్రోమోను విడుదల చేయించారు. గత వారం జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తాజాగా ప్రభాస్ తన పేస్ బుక్ పేజీలో విడుదల చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

బసంతి

బసంతి


‘బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు హీరోగా 'బసంతి' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ టైటిల్ కి A lovestory between a kite and a flight అనే ఇంట్రస్టింగ్ క్యాచీ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

రాజా గౌతం

రాజా గౌతం


సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. ‘బసంతి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా రాజా గౌతమ్‌ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.

ఇతర పాత్రలు

ఇతర పాత్రలు


ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నా

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య

English summary

 "Last week we launched a song from Basanthi movie on the sets of Baahubali. The trailer and the song visuals look very promising. All the best to the entire team" Prabhas posted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu