»   » ప్రభాస్‌ కు నాకు మధ్య పెద్ద గొడవైంది..ఆ తర్వాత టచ్ లో లేను

ప్రభాస్‌ కు నాకు మధ్య పెద్ద గొడవైంది..ఆ తర్వాత టచ్ లో లేను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ చాలా సైలెంట్ గా సరదాగా ఉండే వ్యక్తి అని ఆయనతో పనిచేసిన ప్రతీ వాళ్లు చెప్తారు. మరి అలాంటి ప్రభాస్ తో ఎవరు గొడవపడతారు.. అంత గొడవ పడే అవకాసం ఏముంటుంది అంటే...యస్ నేను గొడవ పడ్డాను అని గర్వంగా చెప్తోంది వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనత్.

చాలా కాలం కిందట ఈ బాలీవుడ్ భామ తెలుగులో 'ఏక్‌నిరంజన్‌' సినిమాలో నటించింది. ఆ సందర్భంగా చాలా ఫ్రెండ్లీగా ఉండే ప్రభాస్‌తో కూడా గొడవపడిందట. 'రంగూన్‌' ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన కంగన ఈ విషయాన్ని వెల్లడించింది.

Prabhas and me Had a Massive Fight : Kangana Ranaut

కంగనా మాట్లాడుతూ...''ఏక్‌నిరంజన్‌' సినిమా చేసే సమయంలో ప్రభాస్‌కు, నాకు మధ్య పెద్ద గొడవైంది. దాంతో మేం చాలా రోజులు మాట్లాడుకోకుండా దూరంగా ఉండిపోయాం. ఆ సినిమా షూటింగ్‌ తర్వాత అతనికి టచ్‌లో లేను.

కానీ, చాలా రోజుల తర్వాత 'బాహుబలి'లో ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయా. ఆ సినిమాలో ఆయన నటన, విన్యాసాలు చూసి విస్తుపోయా. అతణ్ని అలా చూసినపుడు నాకు చాలా సంతోషం వేసింది. ప్రస్తుతం నా కెరీర్‌ చూసి ప్రభాస్‌ కూడా గర్వపడుతుండవచ్చు' అని చెప్పింది కంగన. అయితే ప్రభాస్‌కు, తనకు మధ్య గొడవెందుకు వచ్చిందనేనది మాత్రం కంగన వెల్లడించలేదు.

'ఏక్ నిరంజన్' తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు ఎందుకని కంగనను అడిగితే.. తాను సౌత్ సినిమా నేటివిటీకి పనికిరానేమో అని తనదైన శైలిలో చెప్పిందామె. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన కంగన.. 'రంగూన్'లోనూ ఆకట్టుకుంటోంది.

ఇక బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగూన్‌'. 2.47 గంటల నిడివి గల ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్ తెచ్చుకుంది.

పీరియాడిక్‌ చిత్రాలు తీయడంలో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దీనిని తెరకెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు. సైఫ్‌ అలీఖాన్‌.. షాహిద్‌ కపూర్‌.. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

జూలియా పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఓవైపు ప్రేమికుడు, మరోవైపు కాబోయే భర్త మధ్య నలిగిపోయే యువతిగా చక్కని నటనను కనబరిచింది.

1940ల్లో యాక్షన్‌ హీరోయిన్ గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచుకున్న ఫియర్‌లెస్‌ నదియా జీవితం ఆధారంగా కంగన పాత్రను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫియర్‌లెస్‌ నదియా నటించిన 'హంటర్‌వాలి' చిత్రం నుంచి 'రంగూన్‌'లో 19 సన్నివేశాలు కాపీ కొట్టారంటూ 'హంటర్‌వాలి' నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఫియర్‌లెస్‌ నదియా తరహాలో కొరడా చేతపట్టి కంగన నటించిన 'బ్లడీహెల్‌' అనే పాటకు మంచి స్పందన వస్తోంది.

English summary
Kangana Ranaut also featured in Ek Niranjan movie starring Prabhas in Telugu and it was directed by Puri Jagannath. Kangana Ranaut said that Prabhas and she had a massive fight during the shoot in Switzerland and expressed that she is proud of seeing Prabhas in Baahubali movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu