For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ ‘మిర్చి’ విడుదల తేదీ మారింది

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రభాస్ తాజా చిత్రం 'మిర్చి' విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని మొదట అన్నారు. అయితే ఇప్పుడు ఆ తేదీని పిబ్రవరి 8కి మార్చారు. సంక్రాంతికి పోటీనుంచి తప్పుకున్న ఈ చిత్రాన్ని యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు.

  సంక్రాంతి రేసు నెలా పదిహేను రోజులకు ముందుగానే టాలీవుడ్‌లో ప్రారంభమ యంది. ఇప్పటికే నాయక్‌ విడుదల తేదీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తేదీలు దాదాపు ఖాయమైపోయాయి... ఈ రెండింటి మధ్యలోనా లేక ఇంకా ముందుగానే విడుదల చేద్దామా అనే ఆలోచనతో ఉన్నారు ప్రభాస్‌ 'మిర్చి' ఊగిసిలాడి ఈ నిర్ణయానికి వచ్చింది. సంక్రాంతికి సిద్దమువుతున్న చి్తరాలు ఇప్పటినుంచే భారీస్థాయిలో థియేటర్ల ను బుక్‌ చేసుకోవడం ఆరంభించాయి. రాంచరణ్‌ నిర్మాత డి.వి.వి. దానయ్య, సీతమ్మ వాకిట్లో నిర్మాత దిల్‌రాజు ఇద్దరూ అగ్ర నిర్మాతలే కావడంతో ముందుగానే థియేటర్లను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

  'మిర్చి' కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

  ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈచిత్రం స్టోరీలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందని, అదే విధంగా ఇంటర్వెల్ లో హై ఓల్టేజ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కథకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కానుందని తెలుస్తోంది. అదే సమయంలో ఎంటర్ టైన్మెంట్స్ అండ్ కామెడీ ట్రాక్ కు కూడా సరైన ప్రాధాన్యం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు.

  సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల శివ.

  English summary
  Prabhas’s ‘Mirchi’ was originally scheduled for a December release but it has now been shifted to February. Mirchi is going to hit the screens on February 8th. The movie will have Anushka and Richa as the heroines opposite Prabhas. Dialogue writer Koratala Shiva is making his debut as a director with this film. Vamsi Krishna Reddy and Pramod Uppalapati are jointly producing the movie. Devi Sri Prasad is scoring the music for this romantic entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X