For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్‌ ‘మిర్చి' విడుదల పై కన్ఫూజన్

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ 'మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని, కాదు... డిసెంబర్ లోనే విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవేమీ కాదు..ఈ చిత్రం జనవరి మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాంతో అసలు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే అభిమానుల్లో కన్ఫూజన్ మొదలైంది. నిర్మాతలు ఈ విషయమై ప్రకటన చేస్తే బాగుండును అనేది టాక్. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు.

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ' ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ...'కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్‌ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్‌ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంది'' అన్నారు.

  మొన్నీ మధ్యన విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళికి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పాటలు, మూడు ఫైట్లు మినహా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయని తెలుస్తోంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణం: యు.వి.క్రియేషన్స్.

  English summary
  The release of Prabhas-starrer Mirchi might be pushed back to the third week of January. A little bird told us that there's still quite a bit of shooting left to be completed and looks like the film might not make for Sankranthi. Mirchi has just wrapped up the brief Tenkasi (Tamil Nadu) schedule and the unit is on the way back to Hyderabad. Debutante director Koratala Siva is fast wrapping up the shooting and planning to release the audio in December. V. Vamsi Krishna Reddy and Pramod Uppalapati are producing this film under UV creations. Prabhas will be seen romancing Anushka and Richa Gangopadhyay in this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X