For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సునో సనోరీటా...' అంటూ ఆమె వెనక ప్రభాస్

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'సునో సనోరీటా...' అంటూ రిచా వెనక పడుతున్నాడు ప్రభాస్. తన సంగతి సరే మరి ఆ ముద్దుగుమ్మ ఏం సమాధానమిచ్చిందో తెర మీదే చూడమంటున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రం ద్వారా రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభాస్‌, రిచాలపై ఓ గీతాన్ని చిత్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు.

  'సునో సనోరీటా' అంటూ సాగే ఆ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. రాజు సుందరం నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. నిర్మాతలు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ చిత్రం గురించి చెబుతూ ''నేటితరానికి అద్దంపట్టేలా ఉంటుంది ప్రభాస్‌ పాత్ర. ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు కథకు బలాన్ని చేకూరుస్తాయి'' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్‌ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్‌ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంద''న్నారు.

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ' ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ...'కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.

  డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయని తెలుస్తోంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణం: యు.వి.క్రియేషన్స్.

  English summary
  Prabhas’ upcoming film Mirchi is nearing completion. Currently, the film unit is in Ramoji Film City where a song ‘Suno Senorita’ is being canned on Prabhas and Richa. Rama Jogayya Sastry has written the lyrics for this song. Devi Sri Prasad has composed the music. Madhi is the cinematographer. The film is gearing up for release in January, 2013. Anushka and Richa are playing the lead roles opposite Prabhas. Koratala Siva is directing the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X