»   » చర్చల్లో వచ్చిన పాయింట్ తోనే ప్రభాస్ సినిమా

చర్చల్లో వచ్చిన పాయింట్ తోనే ప్రభాస్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎక్కడో చర్చల్లో వచ్చిన పాయింట్ ఆధారంగా రెండేళ్ళు కష్టపడి తయారు చేసిన కథ ఇది. ప్రభాస్ మీద కొత్త స్టైల్‌ను ప్రయత్నించాం. 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటే ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది అంటున్నారు దిల్ రాజు. దశరధ్ దర్సకత్వంలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ పర్ఫెక్ట్' గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ, యూత్‌కు నచ్చే అన్ని అంశాలుంటాయి. మూడు ఫైట్లు కూడా ఉన్నాయి. 'బొమ్మరిల్లు' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్‌లో సంగీతాన్నందించిన సినిమా ఇది. ఆ చిత్రంలో ఫ్యామిలీ, యూత్‌కు నచ్చే అన్ని అంశాలుంటాయి. మూడు ఫైట్లు కూడా ఉన్నాయి. మా సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రమిది అని అన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ పర్ఫెక్ట్' షూటింగ్ దాదాపు పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్‌లో సంగీతాన్నందించిన సినిమా ఇది అని అన్నారు. కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్‌ రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu