»   » ప్రభాస్ లేటెస్ట్ ఫొటోలతో 'ఫేస్ బుక్' లో అమ్మాయిల హంగామా

ప్రభాస్ లేటెస్ట్ ఫొటోలతో 'ఫేస్ బుక్' లో అమ్మాయిల హంగామా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫేస్ బుక్ లో అమ్మాయిలు ఇప్పుడు తమ అబిమాన హీరో ప్రభాస్ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. వీటిని బట్టే తెలుస్తోంది. ప్రభాస్ కు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ ఎంతో.ఇంతకీ వారు షేర్ చేస్తున్నఫొటోలు చూస్తే మీరు కూడా షేర్ చేస్తారు. అంతకు ముందు ఆయన్ని చూసినవారంతా ఇప్పుడు ఈ ఫోటోల్లో ఉన్న ప్రభాస్ ని చూసి షాక్ అవుతున్నారు. బాహుబలి చిత్రం ప్రమోషన్ లో భాగంగా చైనా మీడియాను కలిసినప్పుడు రాండమ్ గా చేసిన ఫోటొ షూట్ లో ఫొటోలు ఈ క్రింద ఇస్తున్నాం. మీరూ అదే మాట ఖచ్చితంగా అంటారు.

బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది. అయితే ఇంత క్రేజ్ వచ్చినా తమ ఫేవెరెట్ హీరోని తెరపై చూడటానికి ఇంకా చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. బాహుబలి రిలీజ్ కు ముందు కూడా రెండేళ్లు గ్యాప్ వచ్చింది.

అంటే ఈ నాలుగేళ్లలో ప్రభాస్ ఒక సినిమా, దాని కొనసాగింపు చిత్రం మాత్రమే చేస్తున్నారు. తన తోటి హీరోలందరూ ఏడాదికి రెండు నుంచి మూడు చిత్రాలు చేస్తూంటే తాను మాత్రం ఇలా స్టక్ అయ్యిపోయాడు. అయితే అంతకాలం వెయిట్ చేసినందుకు,చేస్తున్నందకు తగ్గ ఫలితం భారీగా వచ్చింది.

ప్రపంచ నలుమూలలోని సినిమా లవర్స్ ప్రభాస్ ని గుర్తు పడుతున్నారు. ఇక బాహుబలి కొనసాగింపు చిత్రం ది కంక్లూజన్ వచ్చాక ప్రభాస్ స్టేచర్ మరింతగా మారిపోతుందని చెప్తున్నారు. ఈ రెండో పార్ట్ లో ప్రభాస్..తన విశ్వరూపం చూపించనున్నారు. తొలిభాగంలో శివుడుగా అదరకొడితే రెండో పార్ట్ లో బాహుబలి గొప్పతనం ఏమిటనేది తెలియలనుంది. ఆ సీన్స్ అద్బుతంగా ప్లాన్ చేసారంటున్నారు.

మరో ప్రక్క రాజమౌళి టీమ్ వేసవి సెలవుల్ని పూర్తి చేసుకొని మళ్లీ రంగంలోకి దిగింది. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'కు అత్యంత కీలకమైన పతాక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 13 నుంచి పది వారాల పాటు నిర్విరామంగా షూటింగ్ జరపనున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు.

ప్రి విజువలైజేషన్

ప్రి విజువలైజేషన్

సవాల్‌తో కూడుకొన్న అత్యంత క్లిష్టమైన ఆ సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రివిజువలైజేషన్‌, రిహార్సల్స్‌ కార్యక్రమాల్ని కొనసాగించి చిత్రీకరణకి సిద్ధమైనట్టు చిత్రబృందం తెలియజేసింది.

ఈ షెడ్యూల్‌లో...

ఈ షెడ్యూల్‌లో...

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితర ప్రధాన నటీనటులంతా పాల్గొంటారు.

ఈ షెడ్యూల్‌లో...

ఈ షెడ్యూల్‌లో...

అప్పటిదాకా వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ చెప్తోంది.

మరో ప్రక్క

మరో ప్రక్క

యూరప్‌లో ‘బాహుబలి': ‘బాహుబలి' ప్రపంచ టూర్‌లో భాగంగా యూరప్‌ వెళ్లబోతోంది.

ఇటీవలే...

ఇటీవలే...

ట్రాన్సిల్వేనియా చలనచిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. సుమారు 2 వేల మంది వీక్షించారు. ఇప్పుడీ చిత్రం పారిస్‌ వెళ్తొంది.

ప్యారిస్ లో ..

ప్యారిస్ లో ..

ఈ నెల 8న అక్కడి ప్రఖ్యాత ‘ది గ్రాండ్‌ రెక్స్‌' థియేటర్‌లో చిత్రాన్ని ప్రదర్శిస్తారు. యూరప్‌లోనే అత్యంత పెద్ద థియేటర్‌గా గ్రాండ్‌ రెక్స్‌కు పేరుంది. అక్కడ తెలుగు, తమిళ భాషల్లో చిత్రం విడుదలవుతోంది

English summary
The latest photo shoot that Prabhas had randomly done, during the promotions of Baahubali's chinese version, is making them want to see the actor on big screen as soon as possible.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu