»   » జూ ఎన్టీఆర్ ని చూపించినట్టే మిస్టర్ ఫర్ ఫెక్ట్ ను చూపిస్తారా....

జూ ఎన్టీఆర్ ని చూపించినట్టే మిస్టర్ ఫర్ ఫెక్ట్ ను చూపిస్తారా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్, కాజల్, తాప్సీ కాంబినేషన్ లో దశరథ్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రానికి 'మిస్టర్ ఫర్ పెక్ట్" అనే టైటిల్ ని ఖరారు చేశారు. 'బృందావనం"లో ఎన్టీఆర్‌ ను కొత్తగా చూపించినట్టే ఈ మిస్టర్ ఫర్ పెక్ట్ లో ప్రభాస్‌ ని కొత్త కోణంలో చూపిస్తున్నాం"అంటున్నారు చిత్ర నిర్మాత దిల్ రాజు. ఈ నెల 15తో 'మిస్టర్ పర్‌ ఫెక్ట్" పూర్తవుతుంది. మరో 15, 20 రోజుల్లో ఈ ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నాం. సంక్రాంతి కానుకగా జనవరి 14న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. అని దర్శక నిర్మాతలు తెలియ జేశారు. ఈ ఏడాది మా సంస్థ నుంచి 'రామ రామ కృష్ణ కృష్ణ, బృందావనం" విడుదలయ్యాయి. రామ రామ కృష్ణ కృష్ణ యావరేజ్ హిట్ అయ్యింది. బృందావనం భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది అన్నారు. మాములుగా మా బేనర్‌లో ఫ్యామిలీస్, యూత్ చూసే చిత్రాలనే తీస్తాం. ఈ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. మరి ప్రభాస్ మిస్టర్ ఫెర్ ఫెక్ట్ కూడా మరో హిట్ ని ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ మిస్టర్ ఫెర్ ఫెక్ట్ ఏ రేంజ్ లో హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu