»   » ప్రభాస్ 150 కోట్లతో చేసే నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఎవరు?

ప్రభాస్ 150 కోట్లతో చేసే నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలితో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 150 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇప్పుడు ప్రభాస్‌ ఒక భాష హీరో కాదు, మూడు భాషల హీరో అనిపించుకుంటున్నారు. ఇకపై ప్రభాస్‌ చేసే సినిమాలన్నీ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లోనే నిర్మాణం జరుపుకోవచ్చు. ఇటు యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

Prabhas next movie heroine Parineeti Chopra?

సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ మూవీ ఈ ఏడాది చివర్లోనే చిత్రీకరణ ప్రారంభమయ్యే అకాశాలున్నాయి. బాలీవుడ్లోనూ రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడి ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు పరిణీతి చోప్రాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో వీలుకాకపోతే సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చూస్తున్నారట.

ఈ చిత్రం తర్వాత రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై 'జిల్‌' రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్‌ మూవీ ప్రభాస్‌ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత చేయబోయే సినిమాల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

English summary
Prabhas next movie will be directed by Sujeeth. Though the movie has been initially planned on a minimal budget, with Prabhas’s market extended, the movie will release in Hindi along with Tamil and Telugu languages. Parineeti Chopra and Sonakshi Sinha are in race for the role as per the sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu