twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక పవన్ తర్వాత ప్రభాసే: సోషల్ మీడియా ట్రెండింగ్ లో దూసుకుపోతున్న బాహుబలి

    |

    ఇప్పటి వరకూ టాలీవుడ్ హీరోలలో చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున తర్వాత వాళ్ళ స్థాయిలో మరెవ్వరూ రాలేకపోయారు. ఆ తర్వాత పవన్, మహేష్, ఎన్టీఆర్, లు వచ్చాక కొంత కాలానికి ప్రభాస్ వచ్చాడు. దాదాపుగా అంతా వారసత్వాన్ని బేస్ చేసుకొని వచ్చిన వారే అయితే ప్రభాస్ మిగతా ముగ్గురికంటే ఆలస్యంగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

    ప్రభాస్

    ప్రభాస్

    బాహుబలి ముందువరకూ ప్రభాస్ రేంజ్ మామూలుగానే ఉండేది. కానీ ఒక్క దెబ్బకు ఆరేళ్ళలో ప్రభాస్ స్థాయి నేషనల్ రేంజి కి వెళ్ళిపోయింది. ఇటు మన టాలీవుడ్ లోనూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా వారిలో కూడా అభిమానాన్ని పొంది మిగతా ముగ్గురినీ అందుకున్నాడు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

    ఇప్పుడైతే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సమాన స్థాయిలో ఉన్నాడు, ముందుండటం అంటే రెమ్యున రేషన్లో, లేదంటే సినిమా కలెక్షన్లలో కాదు. అభిమానుల నుంచి అత్యధికంగా రెస్పాన్స్ ఉన్నవాళ్ళలో ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ రెండో స్థానం లో ఉన్నాడు. ఎలా చెప్పగలం అంటే....

    సోషల్ మీడియా ట్రెండింగ్‌

    సోషల్ మీడియా ట్రెండింగ్‌

    ఇటీవల పవన్ బర్త్ డే జరుపుకున్నారు. ఆయనకు విషెస్ తెలుపుతూ వచ్చిన ట్వీట్స్ మరే హీరోకు రాలేదు. కానీ ఆ తర్వాతి స్థానంలో సోమవారం బర్త్ డే జరుపుకున్న ప్రభాస్ ఉన్నారు. ఇటీవలి కాలంలో హీరోల పేరుతో హ్యాష్ ట్యాగ్లను రూపొందిస్తూ బర్త్ డే విషెస్ తెలపడం ట్రెండింగ్. సోషల్ మీడియా ట్రెండింగ్‌ను విశ్లేషించే ఓ సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది టాలీవుడ్‌లో నలుగురు స్టార్ హీరోస్‌కు గంట వ్యవధిలోనే లక్షల్లో బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టులు వచ్చాయి.

    ప్రభాస్ రెండో స్థానం

    ప్రభాస్ రెండో స్థానం

    వీరిలో పవన్ మొదటి స్థానంలోనూ.. ప్రభాస్ రెండో స్థానంలోనూ ఉన్నారు. HBDLEADERPAWANKALYAN అనే హ్యాష్ ట్యాగ్‌తో 2.9 మిలియన్లకు పైగా ట్వీట్స్ రాగా.. ప్రభాస్‌కు #HBDDARLINGPRABHAS హ్యాష్ ట్యాగ్‌తో 2.1 మిలియన్లకు పైగా ట్వీట్స్ వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అంశం ఏమిటంటే ప్రభాస్ కి అసలు ట్విటర్ అకౌంట్ లేకపోవటం..

    1.1 మిలియన్ల ట్వీట్లతో మహేశ్ బాబు

    1.1 మిలియన్ల ట్వీట్లతో మహేశ్ బాబు

    HBDMAHESHBABUహ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 1.1 మిలియన్ల ట్వీట్లతో మహేశ్ బాబు, #HAPPYBIRTHDAYNTR హ్యాష్ ట్యాగ్‌తో దాదాపు 7లక్షల ట్వీట్లతో ఎన్టీఆర్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. గతం లో చిరు, బాలయ్య, వెంకటేష్ నాగార్జునల కాలం లో ఈ ట్విటర్లూ, ఫేస్బుక్ లూ లేవు గానీ లేదంటే ఇది కూడా ఒక ట్రెండు కింద మారిపోయి. రికార్డులకోసం ప్రతీ యేటా అభిమానులు తాపత్రయ పడుతూనే ఉండేవాళ్ళేమో..

    English summary
    Young Rebel Prabhas fans have shown their strength on twitter, even though actor doesn’t have the Twitter account. #HBDDarlingPrabhas hashtag stood as top second Birthday Hashtag beating Superstar Mahesh Babu #HBDMaheshbabu record of 1.3 Million tweets in 24 hours..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X