»   » షాక్.....ప్రభాస్ లేకుండానే ‘బాహుబలి-3’!

షాక్.....ప్రభాస్ లేకుండానే ‘బాహుబలి-3’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను చెప్పదలుచుకున్న స్టోరీని సగమే చెప్పిన రాజమౌళి త్వరలో రాబోతున్న పార్ట్-2 ‘బాహుబలి-ది కంక్లూజన్'లో కథను పూర్తి చేయబోతున్నాడు.

ఈ రెండు పార్టులు పూర్తయిన తర్వాత ‘బాహుబలి-3' కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల రాజమౌళి స్పష్టం చేసారు. మూడో పార్ట్ కూడా ప్రభాస్ తోనే కొనసాగుతుందని అంతా ఇప్పటి వరకు ఊహించారు. తాజాగా ఓ తమిళ మేగజైన్ ఇంటర్వ్యూలో బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ షాకింగ్ విషయం వెల్లడించారు. ‘బాహుబలి-3' ప్రభాస్ లేకుండానే ఉంటుంది, కట్టప్ప తదితరలు కూడా ఉండరని, తాను ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొదలు పెట్టినట్లు తెలిపారు.

 Prabhas not part of 'Bahubali 3', says writer Vijayendra Prasad

బాహుబలి-3 గురించి రాజమౌళి గతంలో ట్విట్టిర్ ద్వారా ఇలా క్లారిటీ ఇచ్చారు...
బాహుబలి అనే సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాం. దాన్ని కేవలం రెండు పార్ట్స్ తో ముగించేయాలి అని అనుకోవడం లేదు. బాహుబలి పార్ట్ 3 కూడా త్వరలో ప్లాన్ చేస్తాం. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ ఫీల్ అవ్వని అనుభూతిని ఇస్తుందని.. దాని గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేనను అన్నారు. ఈ విషయంలో రూమర్స్ నమ్మవద్దు. ఏ విషయం అయినా నేను స్వయంగా వెల్లడిస్తాను అన్నారు.

ప్రస్తుతానికి మా వద్ద బాహుబలి రెండు పార్టులకు సరిపడ స్టోరీ మాత్రమే ఉంది. ‘బాహుబలి- ది బిగెనింగ్' అనే సినిమాకి ‘బాహుబలి - ది కంక్లూజన్' అనేది పర్ఫెక్ట్ ఎండింగ్. మేము కథని కూడా అక్కడి వరకే ప్రిపేర్ చేసాం. కానీ బాహుబలి 3 అనేది కూడా భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుంది అన్నారు రాజమౌళి.

వాస్తవానికి బాహుబలి సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. మరో వైపు ‘బాహుబలి' విదేశీ బాషల్లోనూ అదరగొడుతోంది. అందుకే మరిన్ని మార్పులు చేసి ఇటు ఇండియన్, అటు ఇంటర్నేషనల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.'

English summary
Writer Vijayendra Prasad he also made it clear that Prabhas, who had starred in the first part and will soon reprise his role in 'Bahubali 2', may not not be a part of the third installment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu