»   » ధూమ్-4లో ప్రభాస్: ఇదీ అసలు వాస్తవం!

ధూమ్-4లో ప్రభాస్: ఇదీ అసలు వాస్తవం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాతో బాలీవుడ్లోనూ పాపులర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని ఆకర్షించాడని, ధూమ్-4 సినిమా ప్రభాస్ తోనే చేస్తున్నారు, ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ బ్యాడీ రోల్ చేస్తుండగా, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ చేస్తున్నరంటూ జాతీయ మీడియాలో సైతం గాసిప్స్ గుప్పుమన్నాయి.

అయితే ఈ గాసిప్స్‌లో నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ టీం ఈ వార్తలను ఖండించినట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం తన దృష్టంతా ‘బాహుబలి-ది కంక్లూజన్' సినిమాపైనే పెట్టాడని అంటున్నారు. ధూమ్-4 సినిమా నుండి ఎవరూ కూడా ప్రభాస్ ను ఇప్పటి వరకు సంప్రదించలేదని, మీడియాలో వినిపిస్తున్న న్యూస్ కేవలం రూమర్స్ మాత్రమే అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్న మాట వాస్తవమే అయినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ప్రభాస్ మరో సంవత్సరం వరకు తన డేట్స్ అన్నీ బాహుబలి-2 కోసమే కేటాయించారని, అందుకు బాలీవుడ్ ప్రాజెక్టులు, నేషనల్ లెవల్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్స్ వస్తున్నా వాటికి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.

ధూమ్ 4

ధూమ్ 4


ధూమ్-4 సినిమాలో ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ రూమర్సే అని తేలిపోయింది.

మ్యారేజ్

మ్యారేజ్


2016 ఆరంభంలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సైతం వచ్చాయి. అతే ప్రస్తుతం తాను కమిటైన బాహుబలి-2 పూర్తయ్యే వరకు పెళ్లికి దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నాడట.

బర్త్ డే

బర్త్ డే


ప్రభాస్ తన 36 పుట్టినరోజు వేడుకను ఇటీవల హైదరాబాద్ లో తన క్లోజ్ ఫ్రెండ్స్, బాహుబలి టీంతో కలిసి జరుపుకున్నాడు.

బాహుబలి

బాహుబలి


బాహుబలి 2 సినిమాకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకునే పనిలో ఉన్నాడు ప్రభాస్.

English summary
Prabhas has been all over the tabloids ever since a famous daily speculated that Prabhas would be a part of the much awaited Hindi project, Dhoom 4. The reports also added that Prabhas will be playing the main baddie while Hrithik plays a cameo role in the film.However, they have come out to be untrue.
Please Wait while comments are loading...