»   » రావణ సంహారం: ప్రభాస్ కు పిలుపు, అడ్డు పడుతున్న రాజమౌళి!

రావణ సంహారం: ప్రభాస్ కు పిలుపు, అడ్డు పడుతున్న రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ స్టార్ ఇమేజ్ నేషనల్ రేంజికి ఎదిగిన సంగతి తెలిసిందే. బాహుబలిలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టడంతో పాటు...అందగాడు, మంచి ఒడ్డు పొడవు ఉన్న సాలిడ్ ఫిజిక్ కావడంతో బాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

కేక పెట్టించే న్యూస్: ప్రభాస్‌ ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో (ఫోటోస్)

ప్రభాస్ కు నేషనల్ వైడ్ మంచి క్రేజ్ ఉండటంతో ఓ నేషనల్ మీడియా సంస్థ వారు ముంబైలో దసరా సందర్భంగా నిర్వహించే రావణ సంహారం కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రభాస్ కు అక్కడికి వెళ్లాలని ఉన్నా ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేని పరిస్థితి.

Prabhas

ఒక వేళ రాజమౌళి అనుమతి ఇస్తే.... తను వచ్చేందుకు సిద్ధమే అని ప్రభాస్ వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు మీడియా సంస్థవారు ఎలాగైనా ప్రభాస్ ను రావణ సంహారం కార్యక్రమానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)

అయితే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ ను పంపేది లేదని, అతడు లేకుంటే షూటింగ్ ఆగిపోతుంది, దీని వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ అడ్డు పడుతున్నాడట. మరి చివరకు ఏమౌతుందో? ప్రభాస్ వెళతాడో? లేదో? తేలాల్సి ఉంది.

English summary
Prabhas may soon be donning the role of mythological Ram. Sources close to the 36-year-old actor claim that “several organisers” have approached Prabhas to shoot the effigy of Ravana on Vijayadashmi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu