»   » ప్రభాస్ తో ఓ ఫోటో ప్లీజ్

ప్రభాస్ తో ఓ ఫోటో ప్లీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా హీరో అయ్యాడు ప్రభాస్. రోజు రోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇంతకాలం ఆడవాళ్లు మాత్రమే ఎక్కువ ఫ్యాన్స్ వున్న ప్రభాస్ కు మగవారు కూడా అభిమానులుగా మారుతున్నారు. ఆయన ఫ్యాన్ క్లబ్ లు పెరుగుతున్నాయి.

అంతెందుకు ఈ మధ్యన ఎయిర్ కోస్టా ఎక్కిన ప్రభాస్ తో ఫోటోలు దిగాడానిరి ఫ్లైట్ కెప్టెన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి, తలో స్నాప్ తీసుకున్నారు. దీనికి ప్రభాస్ కూడా సానుకులంగానే స్పందించి, వారితో ఫోటో దిగడంలో ఉత్సాహం కనబరిచారు. ఇది ప్రభాస్ ఫ్యాన్ పాలోయింగ్ కెపాసిటి. మీరూ ఇక్కడ ఆ ఫొటో చూడవచ్చు.

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. బాహుబలి-2 చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీలో కొంత తీశాక. బల్గేరియాలోనూ, కేరళలోనూ కొంత పార్ట్ తీయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అంతా సిద్దమైంది. అందులో భాగంగా.. కేరళలోని గిరిజన ప్రాంతంలోని ఓ అడవితో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేశారు.

Prabhas Photo with Air Costa captains

కేరళలోని అతి పురాతనమైన కన్నూర్ ఫోర్ట్‌ లో ఆయన షూటింగ్ చేయనున్నారు. పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించిన కోట ఇది. ఈ కోటలో 10 రోజుల పాటు ‘బాహుబలి' సినిమా షూటింగ్ జరుగనుంది. ప్రభాస్‌తో పాటు సినిమాలోని కీ రోల్స్ లో కనిపించే నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ షూటింగ్ లో కొన్ని యుద్ద సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకు ముందు బుల్ ఫైట్ సీన్‌కు సీక్వెల్‌గా కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన యూనిట్ మిగతా సన్నివేశాలను కేరళలో తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా బాహుబలి సీక్వెల్ పై పెరిగిపోయిన అంచనాల అందుకునేందుకు పార్ట్ 2 లో ఒక గంట పాటు వచ్చే వార్ ఎపిసోడ్ ని పూర్తిగా రీ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది.

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

English summary
When Prabhas boarded Air Costa flight recently entire crew and captains competed to have snap with him. Prabhas too obliged them much to their delight. Here is the snap for fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu