»   »  ప్రత్యేక విమానంలో ప్రభాస్, రానా, అనుష్క (ఫోటో)

ప్రత్యేక విమానంలో ప్రభాస్, రానా, అనుష్క (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ఆడియో వేడుక శనివారం సాయంత్రం తిరుపతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళితో పాటు టీం మొత్తం రెండు రోజులుగా తిరుపతిలోనే తిష్టవేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే సినిమాలోని ముఖ్య తారాగణం ప్రభాస్, రానా, అనుష్క మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు. ఆడియో వేడుకలో పాల్గొనేందుకు ప్రభాస్, రానా, అనుష్క ముగ్గురూ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నమే తిరుపతి చేరుకున్నారు. విమానంలో ముగ్గురూ సెల్పీ దిగి అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

బాహుబలి ఆడియోకు హీరో నాని యాంకరింగ్ చేస్తారని గతంలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న విధంగా మే 31న ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగి ఉంటే నాని వచ్చేవాడేమో. కాని నేడు(జూన్ 13) తిరుపతిలో జరుగుతున్న ఆడియో వేడుకకు నాని రావడం లేదు. నాని స్థానంలో యాంకర్ సుమ ఆడియో వేడుకను హోస్ట్ చేయబోతున్నారు.

‘అనుకోకుండా నాని షూటింగులో గాయపడ్డారు. అందుకే రావడం లేదు. బాహుబలి ఆడియో వేడుకకు సుమ గారు యాంకరింగ్' చేస్తారు అని రాజమౌళి స్పష్టం చేసారు.

Prabhas, Rana, Anushka reached Thirupathi

కాగా...ఈ ఆడియో వేడుక నిర్వహణను రాజమౌళి బాహుబలి టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆడియో వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పూర్తిస్థాయి వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రణామాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

బాహుబలి ఆడియో వేడుక ఏర్పాట్ల గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...బాహుబలి ఆడియో వేడుకు సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ డిపార్టుమెంట్, బాహుబలి టీం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడియో వేడుకకు చిన్న పిల్లలను, పెద్ద వారిని తీసుకురావొద్దని రాజమౌళి అభిమానులకు విన్నవించారు.

ఆడియో వేడుకకు సంబంధించిన పాసులు అమ్మడం లేదు. ఎవరైనా అమ్మినా కొనవద్దు. అలా కొన్నారంటే అవి డుప్లికేట్ పాసులే. ప్రభాస్ అభిమాన సంఘాలకు పాసులు స్వయంగా అందించాం. అభిమాన సంఘాల అధ్యక్షులు, రానా మేనేజర్స్ వద్ద పాసులు లభిస్తున్నాయి అని రాజమౌళి తెలిపారు.

English summary
Prabhas, Rana, Anushka reached Thirupathi in Special plane.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu