»   » బాహుబలి2 తర్వాత పిల్లను ఎవరు ఇవ్వరు.. పెళ్లిపై రానా, ప్రభాస్

బాహుబలి2 తర్వాత పిల్లను ఎవరు ఇవ్వరు.. పెళ్లిపై రానా, ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకుడిని వెంటాడుతున్న ప్రశ్న. ఆ తర్వాత బాహుబలిలో నటించిన ప్రభాస్, రానా పెళ్లి గురించిన ప్రశ్న ప్రధానమైనదిగా మారింది. గతంలో ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా బాహుబలి సినిమా తర్వాతనే పెళ్లి గురించి ఆలోచిస్తామని వారిద్దరూ తప్పించుకొన్నారు.

 పెళ్లి ఎప్పుడూ..

పెళ్లి ఎప్పుడూ..

ప్రస్తుతం బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. బాహుబలి సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో వీరిద్దరిని పెళ్లి ఎప్పుడని మీడియా ప్రశ్నించింది. అయితే పెళ్లి గురించి వీరద్దరూ చాలా తెలివిగా ప్రశ్నను దాటవేశారు.

 రానానే పెద్దవాడు..

రానానే పెద్దవాడు..

వయసులో నాకంటే పెద్దవాడైన రానా చెప్తాడు అంటూ రానా మైక్‌ను ప్రభాస్‌కు ఇచ్చాడు. అయితే బాహుబలిలో నాకంటే నీవే పెద్దోడివి అంటూ తిరిగి మైక్‌ను ప్రభాస్ రానా చేతిలో పెట్టాడు. ప్రభాస్ చేతి నుంచి మైక్ అందుకొన్న రానా దిమ్మతిరిగేలా సమాధానమిచ్చారు.

 పిల్లను ఎవరూ ఇవ్వరు..

పిల్లను ఎవరూ ఇవ్వరు..

బాహుబలి2 చిత్రం చూశాక తమకు ఎవరు కూడా పిల్లను ఇవ్వరని రానా చమత్కరించాడు. అమ్మాయిని వెతకడం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనని చెప్పాడు. అయితే పెళ్లి విషయం తనకు తెలియదని, ఇంటివాళ్లే చూసుకొంటారని ప్రభాస్ మరో విధంగా తప్పించుకొన్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరు సంపాదించుకొన్న ప్రభాస్, రానా పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం కారణంగా దాదాపు ఐదేళ్లు తమ పెళ్లిని ఇద్దరు వాయిదా వేసుకొన్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే పెళ్లి కబురు అందిస్తారేమో చూడాల్సిందే.

English summary
Baahubali actors Prabhas, Rana Daggubati reveal about their marrige. Rana said nobody offer their daughters after watching baahubali2. Apart from this Baahubali trailer creating sensational in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu