»   » కరణ్ పార్టీలో బాహుబలి హంగామా: ప్రభాస్ రానాల తో బాలీవుడ్ ఊగిపోయింది (ఫొటోలు)

కరణ్ పార్టీలో బాహుబలి హంగామా: ప్రభాస్ రానాల తో బాలీవుడ్ ఊగిపోయింది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో బాహుబలి-2ను కరణ్ జోహార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఆ సినిమా ఘన విజయం సాధించడంతో.. భారీ పార్టీ ఇచ్చాడు కరణ్ జోహార్. బాహుబలి ది బిగినింగ్ సినిమా 2015లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినప్పుడు బాలీవుడ్ సినీ జనాలకు, బాంబే సెలెబ్రిటీలకు తలెత్తిన ప్రశ్న... ప్రభాస్ ఎవరు.. అప్పటికే రాజమౌళి అంటే మగధీర, ఈగ, మర్యాద రామన్న చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు పరిచయమే. కానీ ఒక తెలుగు కుర్ర హీరో ఏంటి దేశమంతటా ఇంత గొప్ప విజయం సాధించడం ఏమిటి అనే ఆసక్తి తొలి భాగం విడుదలతో బాలీవుడ్ సెలెబ్రిటీ్స్‌లో కలిగింది. కానీ బాహుబలి ది కంక్లూజన్ విడుదల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కలిగిన సునామా కలెక్షన్లు ప్రభాస్ అంటే ఎవరో అందరికీ తెలిసేలా చేసింది.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

బాహుబలి-2ను విడుదల చేసిన నిర్మాత కరణ్ జోహార్ తన 20 ఏళ్ల సినీ జీవింలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని బాహుబలి-2 చిత్రం ద్వారా సాధించారు. కేవలం 125 కోట్ల రూపాయలకు బాలీవుడ్ రైట్స్ కొనుక్కున్న కరణ్ ఇప్పటికే ఈ సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే 300 కోట్లకు చేరుకోవడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

కరణ్ జోహార్ భారీ పార్టీ

కరణ్ జోహార్ భారీ పార్టీ

బాలీవుడ్ కల్లో కూడా ఊహించని విజయం సాధించిన కరణ్ దీంతో బాలీవుడ్‌కు కరణ్ జోహార్ భారీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ మీడియా ప్రతినిధులను కూడా కరణ్ పెద్ద స్థాయిలో ఆహ్వానం పంపాడు కానీ మొదట ప్రభాస్ ఈ పార్టీ కి వెళ్ళనని చెప్పేసాడు.

 చాలా బిడియస్తుడు

చాలా బిడియస్తుడు

ఖచ్చితమైన కారణం కాదు గానీ తెలిసిన వారు చెప్పినదాని ప్రకారం ప్రభాస్ చాలా బిడియస్తుడు. పైగా పార్టీ కల్చర్‌కు అతడు చాలా దూరంగా ఉంటాడని కూడా తెలుస్తోంది. ఆడపిల్లలతో మాట్లాడటం అన్నా, పదిమంది కూడిన చోట మాట్లాడాలన్నా ప్రభాస్ బాగా సిగ్గుపడతాడని, మాట రాదని ఇటీవల కూడా చాలాసార్లు అనుభవమైంది.

పార్టీలో ప్రభాస్ అడుగు పెట్టేసాడు

పార్టీలో ప్రభాస్ అడుగు పెట్టేసాడు

ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ సమక్షంలో ప్రభాస్ మాట్లాడటం అసంభవం అని తన సన్నిహితులు చెప్పారు. పైగా రానాతో పోల్చుకుంటే అటు ఇంగ్లీషులో, ఇటు హిందీలో కూడా ప్రభాస్ పెద్దగా మాట్లాడలేడు. దీంతో తనలో తొలి నుంచి ఉన్న ఈ బిడియం, దానికి తోడు భాషా సమస్య కూడా ప్రభాస్‌ను సెలబ్రిటీలు ఉన్న పార్టీలకు దూరం చేస్తోందని చెప్పారు గానీ చివరాఖరికి ఆ పార్టీలో ప్రభాస్ అడుగు పెట్టేసాడు.

సాహో కోసం ఎదురు చూస్తున్నార‌ట‌

సాహో కోసం ఎదురు చూస్తున్నార‌ట‌

ఈ కార్య‌క్ర‌మానికి వ‌రుణ్ ధావ‌న్, అలియాభ‌ట్, ర‌ణ‌బీర్ క‌పూర్, రానా, ప్ర‌భాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా క‌ర‌ణ్ .. కొద్ది రోజులుగా యూఎస్ హాలీడే ట్రిప్ వెళ్లి ఇండియాకి వ‌చ్చిన ప్ర‌భాస్ కోస‌మే ఈ పార్టీ ఏర్పాటు చేశాడ‌ని అంటున్నారు. తార‌లు అంద‌రు క‌లిసి స‌ర‌దాగా పార్టీలో సంద‌డి చేసిన వేళ‌, ప్ర‌భాస్ ని ప‌లువురుసెల‌బ్రిటీలు ప్ర‌శంసించ‌డంతో పాటు, ఆయ‌న త‌దుపరి చిత్రం సాహో కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పార‌ట‌.

పార్టీ పిక్స్

పార్టీ పిక్స్

ప్ర‌స్తుతం ఈ పార్టీ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఈ లెక్కన ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంటరై పోవటానికి గ్రాండ్ వెల్కం అనే అనుకోవాలి. రానా కి బాలీవుడ్ కొత్తేం కాదు ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ లన్నీ కలిపి పడేసిన రానా బాలీవుడ్ లో కూడా మంచి టచ్ లోనే ఉన్నాడు.

English summary
Last night, Prabhas & Rana Daggubati were spotted attending Karan Johar's bash. Bollywood celebs including Varun Dhawan, Ranbir Kapoor, Alia Bhatt, Sidharth Malhotra and Arjun Kapoor were also spotted at the do and we're here with all the pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu