For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్'రెబల్‌'ఆడియో విడుదల తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్‌'. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని ఆగస్టు 28 ఖరారు చేసారు. లారెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశ్రమలోని పెద్దలుతో పాటు ప్రభాస్ తోటి హీరోలు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఛీఫ్ గెస్ట్ గా రాజమౌళి,దర్శకుడు కె.రాఘవేంద్రరావు రానున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం కి ట్రేడ్ లో మంచి రేట్లు పలుకుతున్నాయి. పవన్,మహేష్,ఎన్టీఆర్,రామ్ చరణ్ చిత్రాల తరహాలో ఈ చిత్రం బిజినెస్ చాలా క్రేజ్ గా జరుగుతోంది. 'రెబల్‌'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

  ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం సాంగ్ షూటింగ్జరుగుతోంది. ఈ పాటతో ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లే. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్‌ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్‌..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్‌.

  అలాగే చిత్రం గురించి మాట్లాడుతూ... రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు.

  ప్రభాస్ ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

  English summary
  
 Prabhas-starrer "Rebel" is currently filming a song on Prabhas at Annapurna seven acres studios, and the film completes its entire shooting part with this song. Producers of the film Bhagawan and Pulla Rao are planning to release Rebel audio songs on August 28. Raghava Lawrence, who is directing the film, is also composing the music after Thaman left the project. Tamannaah and Deeksha Seth are sharing screen space with Prabhas in this action entertainer, which is slated for September release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X