For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రెబల్’లో బూతులు డిలీట్ (సెన్సార్ కట్స్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రెబల్' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. సినిమాలో చిన్న పిల్లలు కూడకూని హింసాత్మక సీన్లు, రొమాంటిక్ సీన్ల్ ఉండటం వల్లనే ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. రెబల్ చిత్రం సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

  కాగా... ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ తాజాగా బయటకు వచ్చింది. అందులో వివరాల ప్రకారం ఈ సినిమాలో ఓ పరమ బూతు పదం(లం...కొడకా)ను డిలీట్ చేయాలని సెన్సార్ బోర్డు దర్శక నిర్మాతలను ఆదేశించింది. అదే విధంగా పోలీస్ యూనిఫాం సన్నివేశంపై ఫ్లాష్ తగ్గించాలని సూచించింది. అదే విధంగా మద్యం బాటిల్‌పై 'టీచర్స్ చాయిస్' అనే పేరు కనపడకుండా బ్లర్ చేయాలని సూచించింది.

  ఇటీవల జరిగిన రెబల్ ఆడియో వేడకలో దర్శకుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ... కడుపు నిండా పెట్టాలన్నా... స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే అని, ఆ రేంజిలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ పండించాడని చెప్పారు. ప్రభాస్ కోరిక మేరకు కథలో మార్పులు చేసాను. రెబల్ సినిమాను డీల్ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసాను. హీరోయిన్స్ డేట్స్ ప్రాబ్లం రావడం కూడా మరో కారణం. మొదట ఈచిత్రంలో కీలక పాత్రకు శరత్ కుమార్‌ని అనుకున్నాం, కానీ పెద్దనాన్నే కరెక్ట్ అని ప్రభాస్ చెప్పడంతో కృష్ణంరాజు గారికి తగిన విధంగా మార్పులు చేయడానికి కూడా కొంత సమయం పట్టిందని లారెన్స్ అన్నారు.

  ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఒకరకంగా ఈచిత్రం ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్‌కు మాస్‌లో మరింత ఫాలోయింగ్ పెరుగుతుందని లారెన్స్ అంటున్నారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  The censor formalities of Rebel Star Prabhas’s upcoming film ‘Rebel’ have been completed, and the film has been given an ‘A’ certificate by the censor board.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X