»   » ఓ స్టార్ అండ్ మాస్ హీరోకి సూపర్ డూపర్ చిత్రమే ‘రెబెల్’

ఓ స్టార్ అండ్ మాస్ హీరోకి సూపర్ డూపర్ చిత్రమే ‘రెబెల్’

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మాస్' డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం రెబల్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మూడోవారం నుంచి హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ 'ప్రభాస్ హీరోగా ఓ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాలన్న మా కోరిక ఈ 'రెబల్' చిత్రంతో నెరవేరుతుంది.

మా దర్శకులు రాఘవ లారెన్స్ ఈ చిత్రం కోసం అద్భుతమైన కధను సిద్దం చేసారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ విని ఎంతగానో ఎక్సైట్ అయ్యారు. భారీ సాంకేతిక రూపొందే ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ అనుష్క ఓ హీరోయిన్ గా అనటిస్తోంది. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకునే ఈ రెబల్ చిత్రంలో ఎన్నో విశేషాలుంటాయి' అన్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. బ్రహ్మానందం, ముఖేష్ రుషి, కెల్లీ డార్జ్, షియాజీ షిండే, అలీ, ఎమ్.ఎస్.నారాయణ, చలపతి రావు, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, జీవా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.'రెబల్'కు మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్ ఎస్, ఫైట్స్ :రామ్ లక్ష్మణ్, ఆర్ట్ ఏ.ఎస్. ప్రకాష్మేకప్: రాము, దుస్తులు: రమేష్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్ .

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X