For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇప్పుడు తమ్ముడితో.. అప్పుడు ఆయన సోదరితో నటించా.. ప్రభాస్

  By Rajababu
  |

  'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న 'సాహో' చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవ తమిళంలో హీరోగా నటించిన చిత్రం 'కుట్రమ్‌ 23'.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై 'క్రైమ్‌ 23' పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. 'వైశాలి' చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణ. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ట్రైల‌ర్ లాంచ్ శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ చేతుల మీదుగా జ‌రిగింది.

  Prabhas To Shoot At Burj Khalifa For 'Saaho's' Next Schedule
  ఈశ్వర్ చిత్రంలో శ్రీదేవితో

  ఈశ్వర్ చిత్రంలో శ్రీదేవితో

  ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ...``నా ఫ‌స్ట్ సినిమా `ఈశ్వ‌ర్‌`లో అరుణ్ విజ‌య్ సిస్ట‌ర్ శ్రీదేవి తో క‌లిసి న‌టించాను. ఇప్పుడు సాహోలో నేను విజ‌య్ క‌లిసి న‌టిస్తున్నాం. `క్రైమ్ 23` సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది. హీరోగా అరుణ్ విజ‌య్‌కు, ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తోన్న నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

  క్రైమ్ 23 చిత్రం మంచి సక్సెస్

  క్రైమ్ 23 చిత్రం మంచి సక్సెస్

  హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ...``నేను విల‌న్‌గా న‌టించిన బ్రూస్‌లీ, ఎంత‌వాడుగాని చిత్రాలు తెలుగులో నాకు మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం నేను, మ‌ణిర‌త్నం గారి న‌వాబ్‌, ప్ర‌భాస్ `సాహో` చిత్రాల్లో న‌టిస్తున్నా. ఇటీవ‌ల నేను త‌మిళ్‌లో న‌టించిన ` కుట్ర‌మ్ 23` చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ అయింది. `క్రైమ్ 23` పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ఆల్ ఎమోష‌న్స్ తో ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు.

  ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం

  ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం

  ప్ర‌తి ఇంట్లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను మా చిత్రంలో చూపించాం. క్రైమ్ 23 అంటే ఏంటో సినిమాలో చూస్తే అర్థ‌మ‌వుతుంది. నేను ఫ‌స్ట్ టైమ్ కాప్‌గా న‌టించాను. అంత‌ర్లీనంగా ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. ప్ర‌భాస్ గారి చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.

  నిర్మాత ఇంద‌ర్ కుమార్ మాట్లాడుతూ...``ఈ చిత్రం త‌మిళంలో పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులో కూడా అదే విధంగా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

  తమిళనాడులో జరిగిన య‌థార్థ కథ

  తమిళనాడులో జరిగిన య‌థార్థ కథ

  మ‌రో నిర్మాత ప్ర‌సాద్ ధ‌ర్మిరెడ్డి మాట్లాడుతూ....‘‘తమిళనాడులో జరిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అక్క‌డ భారీ వసూళ్లు రాబట్టుకొని విమర్శకుల‌ ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అరుణ్‌ విజయ్ కాప్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇందులో మంచి మెసేజ్‌ తో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్‌ హంగున్నీ ఉన్నాయి. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం అని అన్నారు.

  హైలైట్‌గా హైలైట్‌గా సినిమాటోగ్రఫీ

  హైలైట్‌గా హైలైట్‌గా సినిమాటోగ్రఫీ

  విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌, భాస్కరన్‌ స్టైలిష్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మ‌మ్మ‌ల్ని న‌మ్మి తెలుగులో విడుద‌ల చేసే అవ‌కాశం క‌ల్పించిన అరుణ్ విజ‌య్ గారి ధ‌న్య‌వాదాలు. తెలుగులో వారితో ఒక స్ట్రయిట్ మూవీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాం. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌భాస్ గారు ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు అని ప్ర‌సాద్ ధ‌ర్మిరెడ్డి పేర్కొన్నారు.

  అరుణ్ విజ‌య్ ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్

  అరుణ్ విజ‌య్ ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్

  ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ మాట్లాడుతూ...`` వైశాలి తర్వాత తెలుగులో విడుద‌ల‌వుతోన్న నా రెండో చిత్ర‌మిది. త‌మిళంలో క్రిటిక్స్ మంచి రివ్యూస్ రాశారు. అరుణ్ విజ‌య్ గారు కాప్ గా ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచారు. మ‌ద‌ర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోష‌నల్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆదరిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం`` అన్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీల‌కపాత్రల్లో నటించారు.

  ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌;సినిమాటోగ్రఫీ: కె.యమ్‌ భాస్కరన్‌; నిర్మాతలు: ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌; దర్శకత్వం: అరివళగన్‌.

  English summary
  Tamil hero Arjun Vijay gave an impressive performance in the crime thriller ‘Kuttram 23’. This movie was directed by Arivazhagan of ‘Eeram’ and ‘Vallinam’ fame. Like his earlier films, Arivazhagan received immense praise for directing a solid thriller and ‘Kuttram 23’ made decent numbers at the box office as well. ‘Kuttram 23’ is getting dubbed in Telugu as ‘Crime 23’ and is expected to release soon. Trailer of the Telugu version released by none other than the ‘Baahubali’ star Prabhas.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more