»   » భారీ గడ్డం తీసేసాడు...ప్రభాస్ లుక్ (న్యూ ఫోటో)

భారీ గడ్డం తీసేసాడు...ప్రభాస్ లుక్ (న్యూ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం కోసం భారీ‌గా జుట్టు, గడ్డం పెంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ లుక్‌కు సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్ కూడా వచ్చింది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరొక ఫోటో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ గడ్డం తీసేసి ఉండటం గమనార్హం.

ఇక 'బాహుబలి' సినిమా వివరాల్లోకి వెళితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' సెకండ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈచిత్రంలో ప్రభాస్ పోరాట యోధుడైన రాజు పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆద్వర్యంలో 'బాహుబలి' చిత్రం కోసం అద్భుతమైన సెట్టింగ్స్ వేసారు. అలనాటి రాచరికానికి దర్పణంలా ఈ సెట్టింగ్స్ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు.

ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ ని భారీగా ...అన్ని వర్గాలుకు చేరువయ్యేలా చేయాలని, అదే సమయంలో పైరసీని దెబ్బకొట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన releaseday.com అనే ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్ ని స్వయంగా నెలకొల్పారు. అందులో డబ్బు కట్టి...సినిమాలు ఉత్తమ నాణ్యతతో చూడవచ్చు. బాహుబలి విడుదల నాటికి ఆ సైట్ పాపులర్ అవుతుందని, అందులోనే 'బాహుబలి' సినిమా ఆన్ లైన్ వెర్షన్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది.

English summary
Prabhas was recently spotted in his new look. The actor's bushy beard, for a role in his upcoming film Bahubali, is sure to surprise many.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu