»   » ప్రభాస్ ఫైట్ కోసం వామ్మో అన్ని కోట్లా.. కారు చేజ్ దిమ్మతిరగాల్సిందే..

ప్రభాస్ ఫైట్ కోసం వామ్మో అన్ని కోట్లా.. కారు చేజ్ దిమ్మతిరగాల్సిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రంలోని యాక్షన్ సీన్లను భారీ వ్యయంతో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

కేవలం ప్రభాస్ ఫైట్ కోసం రూ.35 కోట్లు

అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను షూట్ చేసేందుకు దాదాపు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిసింది. హీరో, విలన్ మధ్య ఉండే యాక్షన్ సీన్లను హాలీవుడ్ రేంజ్‌లో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 20 నిమిషాల కార్ ఛేజ్ సీన్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడంపై టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

సుజిత్ సినిమా బడ్జెట్ 150 కోట్లు

సుజిత్ సినిమా బడ్జెట్ 150 కోట్లు

యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ రూ.150 కోట్లు. ఈ సినిమాకు సంగీత త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెట్ డిజైనింగ్‌లో నేషనల్ అవార్డు అందుకొన్నసాబు సిరిల్, మాధీ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్

ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్

బాహుబలి2 వచ్చే ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్కశెట్టి, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు.

ఫస్ట్‌లుక్ కు గ్రేట్ రెస్పాన్స్

ఫస్ట్‌లుక్ కు గ్రేట్ రెస్పాన్స్

ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Prabhas's next with Sujeeth Reddy will feature an action sequence which will be made on a whopping amount of Rs 35 crore, say reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu